ఈ సందర్భంగా కొప్పుల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో సిరిధాన్యాలు కీలక పాత్రను పోషిస్తాయన్నారు. సిరిధాన్యాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యాన్ని కల్పించిన ఘనత ప్రధాని నరేంద్రమోడికి దక్కుతుందన్నారు. మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంతం ప్రజోపయోగ కార్యక్రమాలకు వేదికగా మారుతుండడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నయా మిలెట్స్ ప్రతినిధులు అమర్, రఘు, శ్రీకాంత్, యోగా గురువు భరత్ భూషణ్, పరిసర కాలనీల సంక్షేమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment