Monday, July 31, 2023

Sunday, July 30, 2023

విజయం అంతిమం కాదు

 


Success is not final; failure is not fatal: it is the courage to continue that counts


విజయం అంతిమం కాదు; వైఫల్యం ప్రాణాంతకం కాదు: కొనసాగించాలనే ధైర్యం ముఖ్యం

Thursday, July 27, 2023

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం


 World Hepatitis Day 2023 

Theme - One Life, One Liver

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2023

థీమ్ - వన్ లైఫ్, వన్ లివర్

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 2023


 World Nature Conservation Day 2023 

Theme - Forests and Livelihoods : Sustaining People and Planet

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 2023 

థీమ్ - అడవులు మరియు జీవనోపాధి : ప్రజలు మరియు గ్రహాన్ని నిలబెట్టడం

ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు



ఎల్ బీ నగర్ (సక్సెస్ సీక్రెట్) : ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 61వ జన్మదిన వేడుకలను గురువారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించారు. సుదీర్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, పలు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యేను కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.  ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు.  హయత్ నగర్ లోని మదర్ థెరిసా క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ కంబాలపల్లి నరసింహ్మ యాదవ్ మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని షిర్దీసాయినగర్ కాలనీవాసులతో కలసి ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.  ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి  కమలా సుదీర్ రెడ్డిని, కుమారుడు గౌతమ్ రెడ్డిని, హయత్ నగర్ కు చెందిన ప్రముఖులు నక్క రవీందర్ గౌడ్, పారంద రమేష్ ను మర్యాదపూర్వకంగా కలడం జరిగింది.  ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ చారి, యుగంధర్ చారి, పులుసు రవిగౌడ్, రాసాల యాదయ్యయాదవ్, వాకిటి సత్తయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 



















Tuesday, July 25, 2023

పేదరికం ఓడించాలని చూసినా..పట్టుదల గెలిపించింది

ఒక దినసరి కూలీ... chemistry లో phd...నిన్నటి రోజు సోమవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా స్నాతకోత్సవ సందడి అలముకుంది. వేదిక పసిడి కాంతులు పులుముకుంది. కార్యక్రమానికి ఛాన్సలర్‌ హోదాలో ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అంతా హడావిడిగా ఉండటంతో వేదిక దిగువ నుంచి వెదజల్లుతున్న మట్టి పరిమళాలను ఎవరూ గుర్తించలేకపోయారు. కొంత సమయం తరువాత మైకులో సాకే భారతి అనే పిలుపు వినిపించింది. మోడరన్ దుస్తులు ధరించిన అమ్మాయి వేదికపైకి వస్తుందనుకున్నారంతా. కానీ.. అలా జరగలేదు.
***
#పీహెచ్‌డీ_పట్టా_ఆమె_చేతిలో_కాంతులీనింది 
పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురితో కలిసి వచ్చింది సాకే భారతి. అరిగిపోయిన హవాయి చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బుర పడ్డారంతా. అప్రయత్నంగా చేతులన్నీ ఒక్కటై చప్పట్లతో ప్రాంగణమంతా మార్మోగింది. అయినా.. భారతిలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు. పీహెచ్‌డీ పట్టా ఆమె చేతుల్లో చేరి కాంతులీనింది.

సిరిధాన్యాలు.. ఆరోగ్య సిరులు


ఎల్ బీ నగర్, సక్సెస్ సీక్రెట్  :
 
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి అన్నారు. మంగళవారం మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలోని యోగా షెడ్డులో కొప్పుల నర్సింహ్మారెడ్డి నేతృత్వంలో నయా మిల్లెట్స్ ద్వారా వాకర్స్ కు, యోగా సాధకులకు సిరిధాన్యాలతో తయారు చేసిన టిపిన్ లను ఉచితంగా అందజేశారు. 


ఈ సందర్భంగా కొప్పుల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో సిరిధాన్యాలు కీలక పాత్రను పోషిస్తాయన్నారు. సిరిధాన్యాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యాన్ని కల్పించిన ఘనత ప్రధాని నరేంద్రమోడికి దక్కుతుందన్నారు.  మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంతం ప్రజోపయోగ కార్యక్రమాలకు వేదికగా మారుతుండడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నయా మిలెట్స్ ప్రతినిధులు అమర్, రఘు, శ్రీకాంత్, యోగా గురువు భరత్ భూషణ్, పరిసర కాలనీల సంక్షేమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Tuesday, July 18, 2023

సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రారంభం


శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్టు నిర్మించిన సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను 2023 జులై 4న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. సమాజానికి సత్యసాయి చేసిన సామాజిక సేవను,  ట్రస్టు చేపడుతున్న కార్యక్రమాలను మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ వివరించారు. 

అనంతరం సాయిరాం అంటూ మోదీ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ప్రేమ అనే రెండక్షరాల్లో అనంతమైన శక్తి ఇమిడి ఉందని, ప్రేమించండి.. ప్రేమతో సేవ చేయండి అంటూ ప్రపంచ మానవాళికి సత్యసాయి ఇచ్చిన  సందేశం అనుసరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సత్యసాయి తన జీవితాన్నే మానవాళికి అంకితం చేసిన తీరు ఆదర్శనీయమన్నారు. 

తెలంగాణలో మరో 8 కొత్త వైద్య కళాశాలలు

  • తెలంగాణలో మరో 8 కొత్త  వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్‌, మెదక్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
  • ఒక్కో కళాశాలలో 100 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. దీంతో కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు పది వేలకు చేరువకానున్నాయి.

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ తొలి సీజన్‌ విజేత త్రివేణి కింగ్స్‌


  • గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ తొలి సీజన్‌లో త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ విజేతగా నిలిచింది. 2023 జులై 2న జరిగిన ఫైనల్లో ఆ జట్టు సడెన్‌తో అప్డ్‌ ముంబా మాస్టర్‌ను ఓడిరచింది. 

బ్రిటన్‌లోనూ అందుబాటులోకి నీటితో అంత్యక్రియలు


భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు దహనం, ఖననం వంటి సంప్రదాయ విధానాలు అనుసరిస్తారు. ఎలక్ట్రిక్‌ పద్ధతిలోనూ దహన సంస్కారాలు నిర్వహించే విధానం చాలా ప్రాంతాల్లో అమల్లో ఉంది. 

వీటికి భిన్నంగా సరికొత్త విధానం వైపు పలు దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలోనే ‘నీటితో అంత్యక్రియలు’ నిర్వహించే పర్యావరణ హితమైన విధానానికి బ్రిటన్‌ కూడా అనుమతించింది. ఎటువంటి కాలుష్యం లేని ఈ రెసోమేషన్‌ (Rవంశీఎa్‌ఱశీఅ)ను త్వరలోనే బ్రిటన్‌ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. 

ఏమిటీ రెసోమేషన్‌..?

నీటి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించే పద్ధతినే రెసోమేషన్‌ (Rవంశీఎa్‌ఱశీఅ) అంటారు. దీనిలో ఎటువంటి మంటలు ఉండవు. పొటాషియం హైడ్రాక్సైడ్‌, నీటి సహాయంతో మృతదేహాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఇది. తొలుత మృతదేహాన్ని ఓ బయోడీగ్రేడబుల్‌ బ్యాగులో చుట్టి పెడతారు. అనంతరం 95శాతం నీరు, ఐదు శాతం పొటాషియం హైడ్రాక్సైడ్‌తో కూడిన వేడి ద్రావణమున్న కంటైనర్‌లో ఉంచుతారు. దీన్నే ‘బాయిల్‌ ఇన్‌ ది బ్యాగ్‌’గా వ్యవహరిస్తారు. రసాయన చర్య అనంతరం కొన్ని ద్రవాలు బయటకు రాగా.. మిగిలిపోయిన ఎముకలను పొడి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు. ఈ పద్ధతి పూర్తికావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఎటువంటి గాలి కాలుష్య కారకాలు, విషపూరిత వాయువులూ వెలువడవు. అక్వామేషన్‌, ఆల్కలైన్‌ హైడ్రాలసిస్‌  అని కూడా పిలిచే ఈ ప్రక్రియను అత్యంత సురక్షిత విధానంగా పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ విధానాన్ని కెనడా, దక్షిణాఫ్రికాతోపాటు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా బ్రిటన్‌ కూడా ఈ పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమైంది. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే మూడోవంతు తక్కువగా ఉద్గారాలు విడుదల అవుతాయని బ్రిటన్‌కు చెందిన ‘కో-ఆప్‌ ఫ్యూనెరల్‌ కేర్‌’ అనే అంత్యక్రియలు నిర్వహించే సంస్థ వెల్లడిరచింది. దీనికి అయ్యే ఖర్చు కూడా సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియల మాదిరిగానే ఉంటుందని తెలిపింది.

సాధారణంగా ఓ దహన ప్రక్రియలో 245 కిలోల కార్బన్‌ విడుదలవుతుంది. ఇలా బ్రిటన్‌లో దహనసంస్కారాల వల్ల వందల టన్నుల వాయువులు విడుదల అవుతున్నట్లు సీడీఎస్‌ అనే దహన సంస్కారాలు నిర్వహించే సంస్థ వెల్లడిరచింది. మరోవైపు ఈ విధానాన్ని ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రారంభిస్తున్నామని.. మరికొన్ని రోజుల్లోనే బ్రిటన్‌ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ‘కో-ఆప్‌ ఫ్యూనెరల్‌ కేర్‌’ సంస్థ వెల్లడిరచింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ పద్ధతులైన దహన, ఖనన విధానాలకు ప్రత్యామ్నాయం ఇదేనని పేర్కొంటున్నారు.

UPI సదుపాయాలతో SBI యోనో యాప్‌


  • పూర్తిగా నవీకరించిన డిజిటల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ ‘యోనో’ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2023 జులై 2న విడుదల చేసింది. 
  • స్కాన్‌ చేసి చెల్లించడం, ఏదేని నంబరుకు నగదు బదిలీ చేయడం, రిక్వెస్ట్‌ మనీ వంటి యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేÛస్‌) సదుపాయాలను కొత్త యాప్‌లో పొందొచ్చు.
  • 2017లో వచ్చిన యోనో యాప్‌నకు.. ప్రస్తుతం 6 కోట్ల మంది నమోదిత వినియోగదార్లు ఉన్నారు. 202-23లో యోనో యాప్‌ ద్వారా ఎస్బీఐలో 78.60 లక్షల పొదుపు ఖాతాలను తెరిచారు. 
  • నవీకరించిన యోనో యాప్‌తో వినియోగదారులకు మెరుగైన సేవలు లభిస్తాయని, యోనో ప్రయాణంలో ఇదో మైలురాయిని అని బ్యాంక్‌ వెల్లడిరచింది. 
  • 68వ బ్యాంక్‌ డే వేడుకల్లో భాగంగా ఇంటర్‌ ఆపరబుల్‌ కార్డ్‌ లెస్‌ క్యాష్‌ విత్‌ యిల్‌ (ఐసీసీడబ్ల్యూ) సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో ఐసీ సీడబ్ల్యూ సదుపాయం ఉన్న ఏటీఎంల నుంచి, డెబిట్‌ కార్డు లేకుండానే.. ‘యూపీఐ క్యూఆర్‌ క్యాష్‌’ ద్వారా నగదు తీసుకోవచ్చని ఎస్‌బీఐ వెల్లడిరచింది. 

అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల ముగింపు


  • క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 2023 జులై 4న జరిగింది. 
  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- తన ప్రాణాల్ని 26 ఏళ్ల వయసులోనే బలి ఇచ్చిన అల్లూరిది దేశ స్వాతంత్య్రోద్యమంలో ఒక ప్రముఖ అధ్యాయమని అభివర్ణించారు.
  • భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతికశాఖ రూపొందించిన 3డీ యానిమేషన్‌ చిత్రాన్ని ఆవిష్కరించారు.
  • జయంతి వేడుకలను ఏడాది కిందట భీమవరంలో ప్రధాని మోదీ ప్రారంభించగా.. హైదరాబాద్‌లో ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము వచ్చారు

షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం


ప్రధాని మోదీ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం 2023 జులై 3న జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లతో పాటు ఇతర సభ్యదేశాల నాయకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పాక్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో భాగంగా మార్చుకుంటున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం వంటి వాటిని నిరోధించేందుకు నిర్ణయాత్మక చర్యలు అవసరం. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను విమర్శించడంలో ఈ కూటమి  ఎన్నడూ వెనుకాడకూడదు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పుగా మారింది. దానిపై మనమంతా కలిసికట్టుగా పోరాడాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

2001లో రష్యా, చైనా, కిర్గిస్థాన్‌, కజకిస్థాన్‌, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాల అధ్యక్షులు షాంఘై 

ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ నివేదిక


  • ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద 2023 జూన్‌ 3న 12841 షాలీమార్‌-చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నలేనని ‘రైల్వే భద్రత కమిషనర్‌’(సీఆర్‌ఎస్‌) దర్యాప్తు నివేదిక స్పష్టంచేసింది. దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని తేల్చింది. ఈ మేరకు రైల్వేబోర్డుకు నివేదిక సమర్పించింది.
  • రైలు దుర్ఘటనకు దారితీసిన కారణాలను దానిలో విశ్లేషించింది. తప్పుడు వైరింగ్‌, తప్పుడు కేబుల్‌ అనుసంధానత వల్ల 2022 మే 16న ఆగ్నేయరైల్వే ఖరగ్‌పుర్‌ డివిజన్లో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని, లోపాన్ని సరిచేసి ఉంటే కోరమండల్‌ ప్రమాదం తప్పేదని అభిప్రాయపడిరది. సిగ్నలింగ్‌, సర్క్యూట్‌ మార్పులో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది. ఆగిఉన్న గూడ్సు రైలును బహానగాబజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కోరమండల్‌ ఢీకొని పట్టాలు తప్పడం, ఆ పెట్టెలు ఎగిరిపడి, పక్కనున్న మార్గంలో వస్తున్న యశ్వంతపుర్‌ రైలులో చివరి పెట్టెలను ఢీకొట్టడం తెలిసిందే. ఆ ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. యావద్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై సీఆర్‌ఎస్‌తో పాటు సీబీఐ విచారణ చేపట్టింది.

సీఆర్‌ఎస్‌ నివేదికలో కొన్ని అంశాలు

  • సిగ్నల్‌ వ్యవస్థలో లోపాలున్నాయి. రెండు సమాంతర మార్గాలను అనుసంధానించే స్విచ్‌లు పలుమార్లు అసాధారణంగా పనిచేస్తున్నాయని బహానగాబజార్‌ స్టేషన్‌ మేనేజర్‌ చేసిన ఫిర్యాదుపై సిగ్నల్‌-టెలికాం సిబ్బంది తగిన చర్యలు తీసుకుని ఉండాల్సింది.
  • బహానగాబజార్‌ స్టేషన్‌ సమీపంలోని లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ 94 వద్ద ‘ఎలక్ట్రిక్‌ లిఫ్టింగ్‌ బ్యారియర్‌’ను మార్చే పనుల ఆమోదానికి నిర్దిష్ట సర్క్యూట్‌ డయాగ్రమ్‌ను సరఫరా చేయకపోవడం తప్పు.దానివల్లనే తప్పుడు వైరింగ్‌ జరిగింది. కొందరు క్షేత్రస్థాయి పర్యవేక్షకులు వైరింగ్‌ డయాగ్రమ్‌ను మార్చినా దానిని అమలు చేయడంలో విఫలమయ్యారు.
  • ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ స్పందన వేగంగా ఉండాలి. రైల్వే జోన్లకు, విపత్తు యాజమాన్య బృందాలకు మధ్య సమన్వయంపై సమీక్ష జరగాలి.
  • ఉత్తర సిగ్నల్‌ గూమ్టీ వద్ద గతంలో జరిగిన సిగ్నలింగ్‌లో తప్పిదం వల్లనే గూడ్సు రైలును వెనకవైపు నుంచి కోరమండల్‌ ఢీకొట్టింది. సిగ్నల్‌ వైరింగ్‌ చిత్రాలను, ఇతర పత్రాలను, సర్క్యూట్లను తాజాపరిచే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలి.
  • సిగ్నల్‌ ఆధునికీకరణ పనులు చేపట్టడానికి ప్రామాణిక నిర్వహణ అభ్యాసాలను అనుసరించాలి. సిగ్నల్‌ సర్క్యూట్లలో ఎలాంటి మార్పు చేయాలన్నా ఆమోదిత చిత్రం ఉండాలి. మార్పులు చేసిన సిగ్నల్‌ సర్క్యూట్ల పనితీరును పరీక్షించి, మార్గాన్ని పునరుద్ధరించేముందు తనిఖీ చేయడానికి విడిగా ఒక బృందాన్ని నియమించాలి.

ఆదాయంలో 3, 4 స్థానాల్లో ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు


ఆదాయ సముపార్జనలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు దేశంలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 2018-19కి సంబంధించి కేంద్ర రహదారి, రవాణాశాఖ విడు దల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిరచింది. 

రూ. 8.120 కోట్ల ఆర్జనతో మహారాష్ట్ర ఆర్టీసీ తొలిస్థానం సాధించగా రూ.6,125.84 కోట్లతో ఏపీ, రూ.4,919.12 కోట్లతో తెలంగాణ ఆర్టీసీలు 3, 4 స్థానాలు దక్కించుకున్నాయి. నష్టాల్లో ఏపీ, టీఎస్‌ ఆర్టీసీలు 4, 6 ర్యాంకుల్లో ఉన్నాయి. 

ప్రపంచంలోనే అతిపెద్దదైన అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండి దారు శిల్పం



హైదరాబాద్‌ న్యూబోయినపల్లిలోని అనూరాధ టింబర్‌ ఎస్టేట్స్‌ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండి దారు శిల్పాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2023 జులై 1న ఆవిష్కరించారు. 

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అర్హతలపై సవరణలు



జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అర్హతల్లో కేంద్ర విద్యాశాఖ సవరణలు చేసింది. కనీసం పదేళ్ల సర్వీసు ఉన్న రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులే ఇందుకు అర్హులని పేర్కొంది. 

ఈ అవార్డుల కోసం ఒక్కో రాష్ట్రం నుంచి రావాల్సిన నామినేషన్ల పైనా పరిమితి విధించింది. వీటి కోసం రాష్ట్రాల నుంచి 126, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 10. వివిధ స్వతంత్ర విద్యా వ్యవస్థల నుంచి 18 కలిపి గరిష్ఠంగా 154 నామినేషన్లు మాత్రమే పంపాలని పేర్కొంది. 

అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి గరిష్టంగా 6 చొప్పున నామినేషన్లు రావాలని నిర్దేశించింది. ఏటా ఇచ్చే అవార్డుల గరిష్ట సంఖ్యను 17 నుంచి 50కి పెంచింది. అందులో 2 అవార్డులను దివ్యాంగ టీచర్లకు రిజర్వ్‌ చేసింది. 

సాహితీవేత్త మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి మృతి



ప్రముఖ సాహితీవేత్త, వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో పేరొందిన పేదల వైద్యుడు మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి (88) 2023 జులై 2న మృతి చెందారు. 
వేణుగోపాల్‌రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా అయినా కడప నగరానికి చెందిన వరలక్ష్మిని వివాహం చేసుకుని అక్కడే సర్జన్‌గా స్థిరపడ్డారు. తక్కువ ఫీజుతో వైద్యం అందిస్తూ పేరొందారు. ఆయన భార్య వరలక్ష్మి కట్టమంచి రామలింగారెడ్డి మేనకోడలు. 
ప్రముఖ సినిమా నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎంఎస్‌ రెడ్డి) ఆయనకు సొంత సోదరుడు. 
మల్లెమాల 1960లోనే తన పెద్ద కుమార్తె శిరీష పేరుతో కథలు రాయడం మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 100 కథలు (5 సంపుటాలుగా వచ్చాయి) రాశారు. ‘ఆవలి గట్టు’ నవలా రాశారు. ఆయన జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు (1970లో) శ్రీశ్రీ, కొడవటిగంటి వంటి సాహితీ దిగ్గజాలను కడపకు రప్పించి, ఏటా గొప్ప సాహిత్య సభలు నిర్వహించారు. 2009 నుంచి ‘మల్లెమాల సాహిత్య పురస్కారం’ ఏర్పాటు చేసి సాహితీవేత్తలకు పురస్కారాలు అందిస్తున్నారు.

తమిళనాడు ఎంపీ రవీంద్రనాథ్‌ ఎన్నిక చెల్లదు



తమిళనాడులోని తేని నియోజకవర్గ ఎంపీగా ఓపీ రవీంద్రనాథ్‌ ఎన్నిక చెల్లదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రవీంద్రనాథ్‌ 2019 ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి 76,319 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

ఆస్తి విషయాలు దాచి, ఓటర్లకు నగదు, బహుమతులు ఇచ్చి ఆయన గెలుపొందారని, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మిలాని అనే స్థానిక ఓటరు హైకోర్టులో ఎన్నికల కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారించకూడదని రవీంద్రనాథ్‌ తరఫున పిటిషన్‌ వేసినా.. హైకోర్టు దాన్ని కొట్టివేసింది.  రవీంద్రనాథ్‌ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కుమారుడు.

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చీలిక


  • మహారాష్ట్రలో రాజకీయ ఉద్ధండుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) 2023 జులై 2న నిట్టనిలువునా చీలిపోయింది. ఏడాది కిందట శివసేనలో చీలిక వచ్చినట్లుగానే ఇప్పుడు ఎన్సీపీ ముక్కలైంది. 
  • పార్టీ సీనియర్‌ నేత, పవార్కు స్వయానా అన్న కుమారుడైన అజిత్‌ పవారే పార్టీని చీల్చారు. ఆ వెంటనే ప్రభుత్వంలో చేరిపోయారు. ఏక్నాథ్‌ శిందే ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
  • అజిత్‌ పవార్‌ ప్రభుత్వంలో చేరడంతో జితేంద్ర అవధను ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నియమించింది. 

స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌కు ఆధార్‌


  • స్వాతంత్య్ర సమరయోధులు, అర్హులైన వారి కుటుంబ పింఛన్ల జారీకి ఆధార్‌ ధ్రువీకరణ విధానాన్ని తీసుకొస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక్‌ సమ్మాన్‌ యోజన కింద ప్రయోజనాలు పొందాలనుకొనే వ్యక్తులు ఆధార్‌ కార్డు ఉన్నట్లు రుజువు సమర్పించాలని పేర్కొంది. 
  • ఆధార్‌ లేని వారికి ఇతర గుర్తింపు కార్డులు సమర్పించవచ్చని తెలిపింది. ఈ గుర్తింపుకార్డులను కేంద్ర ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయాలని పేర్కొంది. వేలిముద్రలు సరిగా లేని కారణంగా ఆధార్‌ ధ్రువీకరణ విఫలమైతే ఐరిస్‌ స్కాన్‌, ముఖ గుర్తింపు విధానాల ద్వారా ధ్రువీకరించుకోవాలని హోంశాఖ సూచించింది. ఈ మూడు విధానాలూ విఫలమైతే వన్‌టైం పాస్‌వర్డ్‌ ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించాలని స్పష్టంచేసింది.

వరి నూక ఎగుమతి దరఖాస్తు గడువు పొడిగింపు

  • మన దేశం నుంచి వరి నూక ఎగుమతికి అవసరమైన అనుమతులు కోరుతూ చేసుకునే దరఖాస్తు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సెనెగల్‌, గాంబియా, ఇండోనేసియా తదితర దేశాలకు చేసే ఎగుమతుల కోసం జులై 6వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని విదేశీ వాణిజ్య డైరెక్టొరేట్‌ జనరల్‌ పేర్కొంది.

టాంజానియాలో తొలి ఐఐటీ క్యాంపస్‌

  • భారతదేశానికి బయట తొలి ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) క్యాంపస్‌ను టాంజానియాలోని జాంజబాలో ఏర్పాటు చేస్తున్నామని, అక్టోబరు నుంచి ఇది విద్యా కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) 2023 జులై 6న తెలిపింది. ఈ మేరకు ఐఐటీ - మద్రాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 
  • టాంజానియా పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ ఈ పరిణామాన్ని చారిత్రక అడుగుగా అభివర్ణించారు. ఈ క్యాంపస్‌ను పెరుగుతున్న ప్రపంచ అవసరాలకు దీటుగా ఉన్నతవిద్యను అందించే ప్రపంచస్థాయి వేదికగా, పరిశోధన సంస్థగా ఎంఈఏ పేర్కొంది. 
  • టాంజానియా పర్యటనలో భాగంగా ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ ఓడపై జరిగిన రిసెప్షను వేడుకకు జాంజబా అధ్యక్షుడు డాక్టర్‌ హుసేన్‌ అలి ఎంవిన్యీతో కలిసి మంత్రి జైశంకర్‌ హాజరయ్యారు. భారతదేశం చేపట్టిన ఆరు ప్రాజెక్టుల్లో ఒకటైన కిడుతాని మంచినీటి వనరును సైతం ఆయన సందర్శించారు.

భూటాన్‌ నుంచి బంగాళా దుంపల దిగుమతి

  • ఎలాంటి లైసెన్సులు లేకుండానే భూటాన్‌ నుంచి మరో ఏడాది పాటు బంగాళా దుంపలను దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం 2023 జులై 2న అనుమతించింది. గతంలో మంజూరు చేసిన ఈ తరహా అనుమతి 2023 జూన్‌ 30వ తేదీతో ముగిసింది. 
  • తాజాగా ఈ గడువును పొడిగిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టొరేట్‌ జనరల్‌ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 17వేల టన్నుల పచ్చి వక్కలను కూడా కనీస దిగుమతి ధర నిబంధన లేకుండా భూటాన్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతించింది. భూటాన్‌ సరిహద్దుల్లో ఉన్న జల్పాయిగుడి జిల్లా ఛాముర్చి అనే చిన్న గ్రామం ద్వారా వక్కలను దిగుమతి చేసుకోవచ్చు.

అఫ్గానిస్థాన్‌లో మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం

  • కాబూల్‌లోని మహిళల బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని తాలిబన్‌ మంత్రి మహ్మద్‌ అకిఫ్‌ మహజర్‌ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్‌ మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.
  • అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు.. వారి పాలనలో మహిళల హక్కులను హరిస్తున్నారంటూ అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఎన్నో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. బాలికల చదువుపై పరిమితులు విధించింది. సినిమాలు చూడవద్దని.. ఒంటరిగా బయట తిరగవద్దనే ఆంక్షలు అమలు చేస్తోంది.

Monday, July 17, 2023

చిప్స్‌లో వాడే అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు



  • అమెరికా - చైనా మధ్య చిప్‌ వార్‌ తీవ్రమైంది. కంప్యూటర్‌ చిప్స్‌లో వినియోగించే అరుదైన ఖనిజాల(షష్ట్రఱజూ ఎa్‌వతీఱaశ్రీం) ఎగుమతులపై డ్రాగన్‌ పట్టు బిగించింది. గాలియం, జర్మేనియం ప్రభుత్వ అనుమతి లేకుండా ఎగుమతి చేయడానికి వీల్లేదని బీజింగ్‌ ఆదేశాలు జారీ చేసింది. 
  • ప్రపంచంలోనే ఈ ఖనిజాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనానే. అమెరికా తయారు చేసే అత్యాధునిక మైక్రోప్రాసెసర్లను చైనాకు విక్రయించడంపై ఆంక్షలు విధించడానికి ప్రతిగా డ్రాగన్‌ ఈ నిర్ణయం తీసుకొంది. 
  • జాతీయ భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సోమవారం చైనా వాణిజ్యశాఖ వివరణ ఇచ్చింది. గాలియం, జర్మేనియంను కమ్యూనికేషన్లు, సెమీకండెక్టర్లు, సైనిక పరికరాల్లో అత్యధికంగా వినియోగిస్తారు. దీంతోపాటు సోలార్‌ ప్యానల్స్‌ తయారీలో ఈ ఖనిజాలు కీలకమైనవి. 
  • ప్రస్తుతం సెమీకండెక్టర్లను ఫోన్ల నుంచి వాహనాలు, ఆయుధాలు ఇలా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్‌ పరికరంలో వినియోగిస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పోరాటానికి ఇవే కేంద్రంగా నిలిచాయి. గత వారం అమెరికా మిత్ర దేశమైన నెదర్లాండ్స్‌ కొన్ని రకాల ప్రత్యేకమైన చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలతో ఏఎస్‌ఎంఎల్‌ చైనాకు చిప్స్‌ తయారీ యంత్రాల ఎగుమతులపై ఆంక్షలు పడినట్లైంది.
  • చైనాకు సెమీకండెక్టర్లను దక్కనివ్వకుండా చేయాలని అమెరికా చూస్తున్నా- ఆ చిప్‌ల తయారీకి కావలసిన ముడి సరకులపై వాషింగ్టన్‌కు పట్టులేదు. చిప్‌ల తయారీకి కీలకమైన రాగి నిక్షేపాలు చిలీ దేశంలోనే అత్యధికం. వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది చైనాయే. అల్యూమినియం, టంగ్‌స్టన్‌ ఉత్పత్తి చైనా చేతుల్లో కేంద్రీకృతమైంది. లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో ఉన్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ మదర్‌బోర్డుల తయారీకి అవసరమైన గాలియం లోహ నిక్షేపాల్లో 95శాతం చైనాలోనే ఉన్నాయి. ఏతావతా చిప్‌ల తయారీలో ఉపయోగించే అన్ని లోహాలపై చైనాకే పట్టు ఉంది. 
  • అమెరికా దీన్ని ఛేదించడానికి కొత్త వ్యూహాలతో ముందుకురానుంది. భవిష్యత్తులో చిప్‌ల కోసం పోరు సైబర్‌ సీమ నుంచి వాస్తవ ప్రపంచానికి విస్తరిస్తుంది. ఆర్థిక, రాజకీయ, సైనిక పరంగా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. చిప్‌ల రూపకల్పన, ప్రత్యేక యంత్రాలపై వాటి తయారీ, ఉత్పత్తి స్థానాల నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా అనేవి వేర్వేరు విభాగాలుగా, వేర్వేరు దేశాల్లో స్థిరపడ్డాయి. ఈ విభాగాలన్నింటినీ అదుపు చేయగలవారే భవిష్యత్తును శాసించగలుగుతారు. అమెరికా, చైనాల మధ్య ప్రారంభమైన చిప్‌ యుద్ధం ఈ అదుపు కోసమే.

శాంతి కోసం మొసలితో వివాహం



  • ప్రజలు వర్షాల కోసం లేదా పంటలు బాగా పండడం కోసం ప్రార్థిస్తూ విభిన్న ఆచారాలు పాటిస్తారు. దక్షిణ మెక్సికోలోని శాన్‌ పెడ్రో హువాయెలులా అనే పట్టణంలో మాత్రం ప్రజలంతా కలిసి పట్టణ మేయర్‌కు ఆడ మొసలితో వివాహం జరిపించడం సంప్రదాయం. 
  • విక్టర్‌ హ్యూగో సోసా అనే మేయర్‌ చొంటల్‌, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతిని కొనసాగించాలనే ఉద్దేశంతో అలీసియా ఆడ్రియానా అనే ఆడ మొసలిని వివాహం చేసుకున్నారు. 230 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఈ వివాహం తమ ప్రాంత ప్రజలకు మరింత అదృష్టాన్ని తెస్తుందని వారి నమ్మకం. 
  • ప్రజలు పెళ్లి కుమారుడిని చొంటల్‌ రాజుగా.. మొసలిని రాణిగా భావిస్తారు. ఈ వేడుకకు ముందు ప్రజలు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలిని పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు. భద్రత కోసం దాని ముక్కుకు తాడును కడతారు. వధువు (మొసలి)ని ఎత్తుకుని వరుడు నృత్యం చేసి దాని నుదుటిపై ముద్దు పెట్టడంతో వేడుక ముగుస్తుంది.

Sunday, July 16, 2023

ప్రవేశం లేదన్న చోటే ప్రతిభను చాటిన ఇద్దరు అంధ మహిళల విజయగాథ


సక్సెస్ సీక్రెట్ :
వైకల్యంతో ప్రపంచాన్ని చూడలేకపోయినా.. ప్రపంచానికి పాఠాలు చెప్పే సామర్థ్యం తమకు ఉందని చాటారు ఇద్దరు మహిళలు. అంధత్వం తమ జీవితంలో లోపమే తప్ప .. తమ లక్ష్యసాధనకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు. అంతేకాదు, విద్యార్థిగా ప్రవేశానికి నిరాకరణకు గురైన చోటే.. బోధకులుగా అడుగుపెట్టి తమ ‘ప్రతిభ’ను చాటకున్నారు. ఇటీవలే శిమ్లాలోని రెండు యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమితులైన ముస్కాన్‌, ప్రతిభా ఠాకూర్‌ అనే ఇద్దరు అంధ మహిళల స్ఫూర్తిదాయక ప్రయాణమిది.. 

ముస్కాన్‌..
  • శిమ్లా జిల్లాకు చెందిన అంబికా దేవీ, జయ్‌చంద్‌ దంపతుల కుమార్తె ముస్కాన్‌. పుట్టుకతో ఆమె అంధురాలు. రైతు కుటుంబంలో పుట్టిన ఆమె.. కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకొని, స్వశక్తితో ఎదగాలనుకున్నారు. కుల్లులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమె.. పోర్ట్‌మోర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీనియర్‌ సెకండరీ విద్యను పూర్తి చేశారు. 
  • 2013లో రాజ్‌కియా కన్యా మహావిద్యాలయ (RKMV) యూనివర్సిటీలో ప్రవేశం పొందిన ఐదుగురు అంధ బాలికల్లో ముస్కాన్‌ ఒకరు. ఆ కాలేజీ 70 ఏళ్ల చరిత్రలో అంధ విద్యార్థులకు ప్రవేశం లభించడం అదే తొలిసారి. 
  • సంగీతంలోనూ ప్రవేశం ఉన్న ముస్కాన్‌.. దేశవిదేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం మ్యూజిక్‌లో డాక్టరేట్‌ చేస్తున్న ఆమె.. గాయనిగానూ గుర్తింపు పొందారు. హిమాచల్‌ ప్రదేశ్‌ యూత్‌ ఐకాన్‌గా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆమెను ఎంపిక చేసింది. 
  • తాజాగా.. ఆర్‌కేఎంవీ యూనివర్సిటీలో మ్యూజిక్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా పోరాటం ఫలించింది. మ్యూజిక్‌ ప్రొఫెసర్‌ కావాలనేది నా చిరకాల కోరిక. సరైన మార్గంలో వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ముస్కాన్‌ పేర్కొన్నారు. 

ప్రతిభా ఠాకూర్‌..
  • మరో అంధ మహిళ విజయ గాథ ఇది. గతంలో ఓ విద్యా సంస్థలో ప్రవేశానికి నిరాకరణకు గురైన ఈ అమ్మాయి.. తాజాగా అదే కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. జర్నలిస్ట్‌ ఖేమ్‌ చంద్ర శాస్త్రి, సవితా కుమారి దంపతుల కుమార్తె ప్రతిభా ఠాకూర్‌ది హిమాచల్‌ మండీ జిల్లాలోని మతక్‌ స్వగ్రామం. 
  • ఐదో తరగతి వరకు ఇంటివద్దే చదువుకున్న ఆమె.. ఆరో తరగతిలో పాఠశాలలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి చదువులో రాణిస్తూ.. పరీక్షల్లో ప్రతిసారి ప్రథమస్థానం సాధించేవారు. రక్తదానంలో ముందుండే ప్రతిభా.. కవిత, సాహిత్య పోటీల్లోనూ పాల్గొనే వారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. పాలనా, అంతర్జాతీయ వ్యవహారాలపై తనకెంతో ఆసక్తి అని చెబుతారు. 
  • ‘తల్లి నుంచి స్ఫూర్తి పొందిన నాకు ఉపాధ్యాయురాలు కావాలనే కోరిక ఉండేది. కానీ, ఒకటో తరగతిలోనే అడ్మిషన్‌ నిరాకరించారు. వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దడమే నా లక్ష్యం’ అని అంటున్నారు ఈ ప్రతిభ. దివ్యాంగుల కోసం పనిచేసే ఉమంగ్‌ అనే స్వచ్ఛంద సంస్థలో ముస్కాన్‌, ప్రతిభా ఠాకూర్‌లు సభ్యులుగా ఉన్నారు. దీని ద్వారా ముస్కాన్‌తో సహా ఐదుగురి బాలికలకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కూడా లభించింది. 
  • అంధత్వం ఉన్నప్పటికీ తమకేదీ అసాధ్యం కాదనే విషయాన్ని ఇరువురు నిరూపించారని ఫౌండేషన్‌ అధ్యక్షుడు అజయ్‌ శ్రీ పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం లభిస్తే వారు ఎంచుకున్న మార్గంలో ఎన్నో విజయాలు సాధిస్తారని అన్నారు.

చైనాలో ఉపాధ్యాయురాలికి మరణదండన

- చైనాలో 25 మంది పిల్లలకు విషమిచ్చి, ఒకరి మరణానికి కారణమైన ఓ కిండర్‌గార్టెన్‌ టీచర్‌కు మరణశిక్షను అమలు చేశారు. హెనన్‌ ప్రావిన్స్‌ జియావోజువో నగరంలోని నం.1 ఇంటర్మీడియట్‌ కోర్టు 2023 జులై 14న ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఉపాధ్యాయురాలు వాంగ్‌ యున్‌ (40)కు మరణదండనను జులై 13న అమలు చేసినట్లు ఓ నోటీసులో తెలిపింది. - ఇందులోని వివరాల ప్రకారం.. 2019 మార్చి 27న మెంగ్‌మెంగ్‌ ప్రీ-స్కూల్‌లో ‘విద్యార్థి యాజమాన్యం’ విషయమై ‘సన్‌’ అనే ఇంటిపేరున్న ఓ సహోద్యోగితో వాంగ్‌ వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆమె జావలో విష పదార్థాన్ని కలిపి పిల్లలకు ఇచ్చింది. ఇతర విద్యార్థులంతా కోలుకున్నప్పటికీ ఒకరు మాత్రం 10 నెలల చికిత్స అనంతరం మృతిచెందగా.. వాంగ్‌ను కోర్టు దోషిగా నిర్ధరించింది.

Saturday, July 15, 2023

అప్పుడు అడుక్కు తినే వాడి తల్లి..ఇప్పుడు అడిషనల్ ఎస్పీ తల్లి

ఇది కథ కాదు..భిక్షాటన చేసి చదువుకున్న అనంతపురం ఏఎస్పీ హనుమంతు గారి యదార్థగాథ. AGS foundation వారు నిర్వహించిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పుస్తకాలు, డిజిటల్ slates పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హనుమంతు తన బాల్యం గురించి వివరించి, పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి చేసిన ప్రయత్నం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు అడుక్కుతిని బ్రతిన తాను.. ఈ రోజు అడిషనల్ ఎస్పీగా ఎదిగానంటే అందుకు కారణం చదువే అన్నారు. ఒకప్పుడు తన తల్లిని ఈ సమాజం అడుక్కునే వాడి తల్లి అని అనేదని .. అదే సమాజం ఇప్పుడు తన తల్లిని అడిషనల్ ఎస్పీ తల్లి అంటోందన్నారు. తమ తల్లిదండ్రులను ఈ సమాజం గౌరవించేలా చేసే బాధ్యత పిల్లలపైనే ఉందని, అది చదువు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. శోకం నిండిన జీవితాన్ని ఎలా శ్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉందన్నారు. తన జీవన పోరాటం గురించి హనుమంతు గారు ఆవిష్కరించిన అతని అంతరంగం ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. హనుమంతు గారి ప్రసంగాన్ని మీరే ఒక్కసారి వినండి..అప్పుడు మీకే అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూసాక మీ పిల్లలకు కూడా తప్పకుండా చూపిస్తారు. #successsecret #iamproudofpolice #policestory #hearttouchingstory