- భూమికి పొరుగునే ఉన్న అంగారకుడిపై ఒకప్పుడు పొడి, తేమతో కూడిన రుతువులు ఉండేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడ జీవుల నివాసానికి అనువైన పరిస్థితులు ఉండి ఉంటాయని తెలిపారు.
- అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్.. అంగారకుడి నేలపై పగుళ్ల తీరుకు సంబంధించిన చిత్రాలను అందించింది. వాటిని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అరుణగ్రహంపై కొంతకాలం పాటు నీరు ఉండేదని, ఆ తర్వాత ఆవిరయ్యేదని పేర్కొన్నారు. అక్కడి మట్టిలో పగుళ్లు ఏర్పడేవరకూ ఈ పోకడ కొనసాగిందని తెలిపారు.
- ‘‘అంగారకుడిపై నీటికి సంబంధించిన చరిత్రలో కొన్ని అధ్యాయాలపై అస్పష్టత ఉండేది. ఒకప్పుడు వేడి, తేమతో కూడిన ఆ గ్రహం.. శీతలంగా, పొడిగా ఎలా మారిందన్నదానిపై స్పష్టత లేదు. అక్కడి మట్టిలోని పగుళ్లు.. ఆ గ్రహంపైన కొనసాగిన సంధి కాలాన్ని సూచిస్తోంది. ఆ సమయంలో నీరు అంత పుష్కలంగా ఉండేది కాదు. కానీ నీటికి సంబంధించిన అంశాలు క్రియాశీలకంగానే ఉండేవి. భూమి మీద మట్టిలో వచ్చే ఇలాంటి పగుళ్లు తొలుత ఇంగ్లిష్‌లో ‘టి’ ఆకారంలో ఉండేవి. ఆ తర్వాత అక్కడ నీరు చేరడం, మళ్లీ అది ఎండిపోవడం వల్ల ఆ పగుళ్లు ‘వై’ ఆకృతిలోకి మారేవి. అరుణ గ్రహంపై కూడా ఈ వై ఆకృతి పగుళ్లు కనిపించాయి. దీనిని బట్టి అక్కడ కూడా తడి-పొడి సీజన్లు ఉండేవని అర్థమవుతోంది’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన నినా లాంజా పేర్కొన్నారు. ఈ లెక్కన అంగారకుడిపై ఒకప్పుడు భూమిని పోలిన వాతావరణం ఉండేదని తెలిపారు. నివాసయోగ్య పరిస్థితులూ ఉండేవన్నారు.
Saturday, August 12, 2023
అంగారకుడిపై కొంతకాలం ఆవాసయోగ్య పరిస్థితులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment