Saturday, August 12, 2023

అంతరిక్ష వ్యర్ధాలతో చిక్కులు

  • మహా నగరాల్లో ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు తరచూ చూస్తూ ఉంటాం. సువిశాలమైన అంతరిక్షంలోనూ ఈ సమస్య తప్పడంలేదు. దీనివల్ల ఉపగ్రహ ప్రయోగాలు ఆలస్యం అవుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కూ అలాంటి పరిస్థితే తలెత్తింది. వివిధ దేశాల అంతరిక్ష ప్రయోగాల కారణంగా రోదసిలో భారీ సంఖ్యలో వ్యర్థాలు ఏర్పడ్డాయి. అవి అంతరిక్ష ప్రయోగాలకు ఆటంకం కలిగిస్తున్నాయి.
  • 10 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న మిలియన్ల కొద్దీ అంతరిక్ష వ్యర్థాల వల్ల.. రోదసిలోని ఉపగ్రహాలు, ఇతర కీలక పరికరాలకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఇలాంటి చిన్న వస్తువులను జాబితాలో చేర్చరు. జాబితాలో చేర్చిన పెద్ద వస్తువులే 27వేలు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. వీటిలో 80 శాతం వ్యర్థాలే కావడం గమనార్హం.
  • అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల జులై 30న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగం ఒక నిమిషం పాటు ఆలస్యమైంది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం ఆరున్నరకు నింగిలోకి వెళ్లాల్సిన పీఎస్‌ఎల్‌వీ.. 6.31 గంటలకు వెళ్లినట్టు ఇస్రో తెలిపింది. 500 కిలోమీటర్ల పైన భూకక్ష్య అంతరిక్ష వస్తువులతో దట్టంగా నిండిపోవడం వల్ల, వాటిని ఢీ కొట్టే ప్రమాదాన్ని తప్పించడానికి ఈ ప్రయోగంలో స్వల్ప జాప్యం చేసింది.

భారత్‌ చొరవ.. 

  • భూ ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్య అత్యంత విలువైంది. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ఇస్రో స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసింది. ప్రయోగించిన రాకెట్ల కక్ష్యను 300 కిలోమీటర్లకు తగ్గించడం వల్ల నాలుగవ దశలోని పీఎస్‌ఎల్‌వీ వ్యర్థాలు భూమికి తిరిగి చేరి కాలిపోతున్నాయి. ఇస్రో ఇలా చేయకపోతే పద్దెనిమిదేళ్లు పైకక్ష్యలోనే ఇవి వ్యర్థాలుగా తిరుగుతూ ఉంటాయి.

పెద్ద పరిమాణంలో 26 వేలు..

  • అమెరికా అంచనా ప్రకారం 10 సెంటీమీటర్ల కన్నా పెద్దవైన వ్యర్థాలు 26,783 ఉన్నాయి. మరింత చిన్న శకలాలు లక్షల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. ఇందులో 40 శాతం వాటా అమెరికాదే. రష్యాకు 28 శాతం, చైనాకు 19 శాతం వాటా ఉన్నట్లు ఇస్రో తెలిపింది. భారత్‌ వల్ల ఏర్పడిన అంతరిక్ష వ్యర్థాలు 0.8 శాతమేనని వివరించింది. సంఖ్యాపరంగా చూస్తే అవి 217 వస్తువులు మాత్రమేని వెల్లడిరచింది.

నీలి ఆకుపచ్చ రంగులో చందమామ

  • చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వీడియోను చంద్రయాన్‌-3 మిషన్‌ 2023 ఆగస్టు 6న చిత్రీకరించింది. ఈ వీడియోను ఇస్రో సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది.
  • చంద్రయాన్‌-3 మిషన్‌ శనివారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ వీడియోలో చందమామ ఉపరితలం నీలి

No comments:

Post a Comment