- భారత్‌లోని రక్షణశాఖ వెబ్‌సైట్లు, కంప్యూటర్లపై సైబర్ దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయిన తమ శాఖలోని కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను.. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మాయ’ ఓఎస్‌తో భర్తీ చేయనుంది. ‘మాయ’ను ఓపెన్ సోర్స్ ఉబంటు ఆధారంగా రూపొందించారు.
- ‘‘మాయ ఇంటర్‌ఫేస్, పనితీరు పూర్తిగా విండోస్‌ను పోలి ఉంటుంది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి మారినా.. పెద్దగా సమస్యలేమీ ఉండవు. ఆగస్టు 15 నాటికి సౌత్ బ్లాక్‌లో ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న కంప్యూటర్లలో దీనిని ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు. దీంతోపాటు ఎండ్‌పాయింట్ డిటెక్షన్, ప్రొటెక్షన్ వ్యవస్థ ‘చక్ర వ్యూప్‌ా’ను కూడా ఇన్‌స్టాల్ చేయనున్నట్లు వెల్లడిరచారు.
- ప్రస్తుతం రక్షణశాఖలో ఇంటర్నెట్, త్రివిధ దళాల నెట్‌వర్క్‌తో అనుసంధానించని కంప్యూటర్లలో మాత్రమే మాయ ఓఎస్‌ను వాడుతున్నారు. త్వరలోనే త్రివిధ దళాలకు చెందిన నెట్‌వర్క్ వ్యవస్థల్లో ఈ ఓఎస్‌ను వినియోగించే అవకాశం ఉంది. ఇప్పటికే నౌకాదళం దీనికి సంబంధించిన అనుమతులు మంజూరు చేసింది. సైన్యం, వాయుసేన మాత్రం మాయ పనితీరును అంచనా వేస్తున్నాయి.
- మాయా ఓఎస్‌ను ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఆరునెలల వ్యవధిలో అభివృద్ధి చేశాయి. ఈ ఓఎస్ మాల్‌వేర్ సహా పలురకాల సైబర్ దాడులను కట్టడి చేస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కీలక వ్యవస్థలపై పలు మార్లు మాల్‌వేర్, రాన్సమ్‌వేర్ దాడులు జరిగాయి. దీంతో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన ఓఎస్‌తో మార్చాలని నిర్ణయించారు.
Saturday, August 12, 2023
సైబర్ దాడులు తట్టుకొనేందుకు రంగంలోకి ‘మాయ’
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment