Tuesday, August 8, 2023

Beluga Air Bus : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం బెలుగా ఎయిర్‌బస్‌

 

Beluga Airbus

  • తిమింగలం ఆకారంలో ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌ బస్‌ బెలుగా రవాణా వాణిజ్య సేవల కోసం తయారుచేయబడిరది.
  • ఎయిర్‌బస్‌ బెలూగా సైనిక, సముద్ర, అంతరిక్షం,ఎనర్జీ,ఏరోనాటిక్స్‌ సహా వివిధ రంగాలకు కార్గో సేవలను అందిస్తుంది. 
  • రష్యన్‌ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి. 
  • బెలుగాను ఎయిర్‌బస్‌ సంస్థ తయారు చేస్తోంది. తొలి ఫ్లయిట్‌ను 1994లో తయారు చేసింది. 
  • 2010లో ఎయిర్‌బస్‌ బెలుగా శూ పేరుతో భారీ విమానంను తయారు చేసింది.  జనవరి 2020లో బెలూగా తొలిసారిగా ఎగిరింది. 
  • బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ ఏరోస్పేస్‌ కంపెనీలు పాలు­పంచుకున్నాయి.

బెలుగా వివరాలు..

  • పొడవు : 56.16 మీటర్లు
  • ఎత్తు : 17.25 మీటర్లు
  • రెక్కల విస్తీర్ణం : 44.84 మీటర్లు
  • కెపాసిటీ : 47,000 కేజీలు
  • ఇంధన సామర్థ్యం : 23,860 లీటర్లు


No comments:

Post a Comment