- దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత చందమామపై వ్యోమనౌకను దించేందుకు రష్యా చేసిన ప్రయత్నం విఫలమైంది. పుతిన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్.. సాంకేతిక సమస్యతో చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది.
- లూనా-25ని 2023 ఆగస్టు 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు. ఆగస్టు 16న అది విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జాబిల్లి ఫొటోలనూ పంపింది.
- ఆగస్టు 19న ఈ వ్యోమనౌకను దీర్ఘవృత్తాకార ప్రీ ల్యాండిరగ్ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్’ ఉపక్రమించింది. అందుకోసం లూనా-25లోని ఇంజిన్‌ను మండిరచింది. అయితే అది నిర్దేశిత పరామితులకు అనుగుణంగా జరగలేదు. దీంతో వ్యోమనౌక ‘అనియంత్రిత కక్ష్య’లోకి ప్రవేశించిందని రష్యా పేర్కొంది. అనంతరం అది కూలిపోయిందని ఆగస్టు 20న వెల్లడిరచింది. వైఫల్యానికి కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
పూర్వవైభవ సాధనకు ప్రయత్నించి..
- సంక్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఏడాదిపాటు పరిశోధనలు జరిపేందుకు లూనా-25ని రష్యా ప్రయోగించింది. భవిష్యత్‌లో చంద్రుడి వద్ద పూర్తి ఆటోమేటిక్ రోదసి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నదీ దాని ప్రణాళికల్లో భాగం. ఈ వ్యోమనౌక ద్వారా చంద్రుడి అంతర్గత నిర్మాణాన్ని శోధించాలని, నీరు సహా సహజవనరులను అన్వేషించాలని భావించింది.
- జాబిల్లి ఉపరితలంపై కాస్మిక్ కిరణాల ప్రభావం, విద్యుదయస్కాంత రేడియోధార్మికత ప్రభావం వంటి వాటి గురించి శోధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. లూనా-24 పేరుతో 1976లో రష్యా (నాడు సోవియట్ యూనియన్) చివరిసారిగా చంద్రుడిపైకి ల్యాండర్‌ను ప్రయోగించింది.
- ఒకప్పుడు అంతరిక్షంలో ప్రబల శక్తిగా ఉన్న రష్యా తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే లూనా-25 ప్రయోగాన్ని చేపట్టింది. భవిష్యత్‌లో చందమామ కక్ష్య, ఉపరితలం కేంద్రంగా విస్తృత కార్యకలాపాలకు ప్రణాళికలు రచించింది.
Common Yet Uncommon : సుధామూర్తి చిన్న పిల్లల పుస్తకం ‘‘కామన్ ఎట్ అన్‌కామన్’’
Lander Luna-25 which crashed on the moon belonged to which country?
- After a gap of almost 50 years, Russia's attempt to land a spacecraft on Chandamama failed. The Luna-25 lander launched by the Putin government crashed on the surface of the moon due to a technical problem.
- Luna-25 was launched on August 11, 2023 from the Vostochny Cosmodrome in Russia. It successfully entered lunar orbit on August 16. Jabilli also sent photos.
- On August 19, the Russian space agency Roscosmos launched the spacecraft into an elliptical pre-Landirog orbit. For that the engine of Luna-25 was fired. However, it did not meet the specified parameters. Russia claimed that the spacecraft had entered an 'uncontrolled orbit'. Later it was revealed on August 20 that it had collapsed. It said that a special commission is being set up to find out the reasons for the failure.
Try to practice pravaybhava..
- Russia launched Luna-25 to conduct year-long research in the complex South Pole region. Part of its plans is to set up a fully automatic radio station on the moon in the future. Through this spacecraft, it is expected to explore the internal structure of the moon and explore natural resources including water.
- Zabilli also aims to search for the effect of cosmic rays and electromagnetic radiation on the surface. Russia (then Soviet Union) last launched a lander to the Moon in 1976, named Luna-24.
- Once the dominant power in space, Russia is desperately trying to regain its former glory. Luna-25 was launched as a part of it. In the future, Chandamama has plans for a wider range of operations centered on orbit and surface.
No comments:
Post a Comment