- ఒకప్పుడు అమెరికా, యూరప్ దేశాలకు పరిమితమైన పేగు పూత వ్యాధి (ఇన్‌ఫ్లెమేటరీ బౌల్ డీసీజ్-IBD) మన దేశంలోనూ విజృంభిస్తున్నట్లు తాజాగా తేలింది.
- 2006లో 0.1 శాతం ఉన్న కేసులు ప్రస్తుతం 5.4 శాతానికి పెరిగినట్లు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) వైద్యుల అధ్యయనంలో తేలింది.
- ఈ వివరాలు తాజాగా ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ రీజినల్ హెల్త్-ఆగ్నేయాసియాలో ప్రచురితమయ్యాయి.
- 2020 నుంచి 2022 మధ్య పట్టణ అవుట్ పేషెంట్ క్లినిక్‌లు, గ్రామీణ ఆరోగ్య శిబిరాలు, మొబైల్ కేంద్రాల ద్వారా 31 వేల మంది రోగులను పరీక్షించారు.
- ఉదర అల్ట్రాసౌండ్, కొలనోస్కోపీ పరీక్షల్లో ఈ సమస్యను గుర్తించారు.
- రోగుల సరాసరి వయసు 44 సంవత్సరాలు. ఇదే సంస్థ 2006లో నిర్వహించిన సర్వేలో 0.1 శాతం ఐబీడీ ఉన్నట్లు గుర్తించింది.
ఐబీడీ ఎందుకంటే..
- జంక్, ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం వినియోగం పెరగడంబీ అధిక మసాలాలు, వేపుళ్లు, పదేపదే వాడిన నూనెతో వండిన పదార్థాలు తీసుకోవడం వల్ల పేగు పూత సమస్య (ఐబీడీ) వస్తుంది.
- జంక్ ఆహారం మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తుంది. హాని చేసే బ్యాక్టీరియాలు, ఫంగస్ పైచేయి సాధిస్తాయి.
- బాధితుల్లో రక్త విరేచనాలు, పొత్తి కడుపు నొప్పి, బరువు కోల్పోవడం, తరచూ మలవిసర్జన, జ్వరం, రక్తహీనత, ఆందోళనలాంటి లక్షణాలుంటాయి. ఒకటి, రెండో దశలోనే చికిత్స తీసుకోకుంటే తీవ్ర సమస్యగా మారుతుంది.
- ఆహార అలవాట్లు మార్చుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఇతర పీచు ఉన్న ఆహారం మేలు.
No comments:
Post a Comment