- మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే కొత్త జన్యువులను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (బ్రిటన్), లావాల్ విశ్వవిద్యాలయాలకు (కెనడా) చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- ఇప్పటిదాకా బీఆర్సీఏ1, బీఆర్సీఏ2, పీఏఎల్బీ2 జన్యువుల్లోని లోపాలే రొమ్ము క్యాన్సర్‌కు దారి తీస్తాయని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు వీటికితోడు మరో నాలుగు జన్యువులవల్లా క్యాన్సర్ వస్తుందని కనిపెట్టారు. వాటిలో ఎంఏపీ3కే1 ఒకటి.
- రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 26,000 మంది మహిళలతోపాటు ఆ వ్యాధిలేని 2.17 లక్షల మంది మహిళలపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ఈ మహిళలంతా ఐరోపా, ఆసియాల్లోని 8 దేశాలకు చెందినవారు.
- శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన జన్యువుల లోపాలవల్ల అరుదుగానే క్యాన్సర్ వస్తుంది. ఈ జన్యు లోపాలపై మరింత పరిశోధన జరిపి తుది నిర్ధారణకు రావాల్సి ఉందని, ఆ పని పూర్తయితే కొత్త తరహా చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు వివరించారు.
Tuesday, August 22, 2023
క్యాన్సర్ కారక కొత్త జన్యువుల గుర్తింపు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment