Friday, August 18, 2023

saliva sample : లాలాజల నమూనా పరీక్షతో హృద్రోగ ముప్పును పసిగట్టగల విధానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?

 

saliva sample-successsecret

  • గుండె-రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును కేవలం లాలాజల నమూనా పరీక్షతో ముందుగానే పసిగట్టగల సరికొత్త విధానాన్ని కెనడాలోని మౌంట్‌ రాయల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 
  • సాధారణంగా చిగుళ్ల ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల పీరియడాంటైటిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. దాని బాధితుల్లో ఇన్‌ఫ్లమేటరీ కారకాలు చిగుళ్ల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి.. రక్తనాళ వ్యవస్థకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
  • ఈ నేపథ్యంలో- లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులను గుర్తించడం ద్వారా హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల రాక ముప్పును ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో గుర్తించారు. 
  • పలువురు వ్యక్తులను సెలైన్‌తో పుక్కిలించేలా చేసి.. తద్వారా సేకరించిన లాలాజల నమూనాలను వారు విశ్లేషించారు. లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో.. రక్తనాళాలు బిరుసుగా మారుతున్నాయని, రక్తప్రవాహానికి అనుగుణంగా వ్యాకోచించే సామర్థ్యం వాటికి తక్కువగా ఉంటోందని నిర్ధారించారు. అలాంటి వ్యక్తుల్లో హృద్రోగాల ముప్పు పెరుగుతోందని తేల్చారు.


Which country's scientists have discovered a way to detect the risk of heart disease by testing a saliva sample?

  • Scientists at Mount Royal University in Canada have discovered a new way to detect the risk of cardiovascular diseases by simply testing a saliva sample.
  • An infection called periodontitis is usually caused by inflammation of the gums. In its victims, inflammatory factors are more likely to enter the bloodstream through the gums and damage the vascular system.
  • In this context, scientists have found out in the latest research that by detecting the levels of white blood cells in saliva, the risk of cardiovascular diseases can be detected early.
  • They analyzed the saliva samples collected by having several people gargle with saline. In people with high levels of white blood cells in saliva, it was concluded that the blood vessels become narrower and their ability to dilate according to the blood flow is less. It was concluded that the risk of heart disease is increasing in such people.

No comments:

Post a Comment