- ఇరుకైన వీధుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు.. సహాయక చర్యల్లో సిబ్బందికి సమయం వృథా అవుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో అగ్నిమాపక దళాలకు సాయంగా పనిచేసే మినీ రోబోను మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన మనుజ్ జైశ్వాల్ (21) తయారుచేశాడు.
- రిమోట్ కారులా ఉండే ఈ రోబోకు పైన కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్‌ను అమర్చాడు. రిమోట్ కంట్రోల్‌తో ఇది పనిచేస్తుంది. ఇలాంటివి భారీఎత్తున తయారుచేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని జైశ్వాల్ చెప్పాడు. ఆటోమేషన్ రోబోటిక్స్‌లో ఇంజినీరింగు చదువుతున్న ఈ యువకుడు కృత్రిమమేధతో పనిచేసే రోబో తయారుచేసి అగ్నిప్రమాదాలు నివారించడం గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. ఈ రోబోలపై పేటెంటు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని జైశ్వాల్ తెలిపాడు.
Saturday, August 12, 2023
మనుషులు వెళ్లలేని చోట.. మంటలార్పే ఫైర్ రోబో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment