- గర్భిణిగా ఉన్నప్పుడు ఒక మహిళ తీసుకునే మంచి ఆహారంతో ఆమెకు పుట్టబోయే శిశువుకే కాకుండా మనవళ్లు, మనవరాళ్ల మెదడు ఆరోగ్యానికీ ప్రయోజనం కలుగుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు.
- యాపిళ్లు, కొన్ని రకాల మూలికల్లోని ఒక పదార్థంతో ఈ రక్షణ లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఏలిక పాములను జన్యు నమూనాలుగా ఉపయోగించి మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.. ఈ విషయాన్ని గుర్తించారు.
- ఆ కీటకాల్లో కనిపించే అనేక జన్యువులు.. మనుషుల్లోనూ ఉండటమే ఇందుకు కారణం. వీటిపై పరిశోధనల ద్వారా మానవ కణాల గురించి లోతైన అవగాహన ఏర్పడుతుంది.
- మన మెదడు సక్రమంగా పనిచేయడానికి ‘కమ్యూనికేషన్ కేబుళ్లు’ దోహదపడుతుంటాయి. వీటిని యాక్సాన్లుగా పేర్కొంటారు. ఇవి నాడీ కణాలను అనుసంధానిస్తాయి.
- ఈ నెట్‌వర్క్ బలహీనపడటం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందని, అది నాడీ క్షీణతకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. యాపిల్స్‌తోపాటు తులసి, రోజ్‌మేరీ వంటి కొన్ని రకాల మూలికల్లో ఉండే ఉర్సోలిక్ ఆమ్లం.. ఈ యాక్సాన్లు పెళుసుబారకుండా చూస్తుందని వారు వివరించారు.
Saturday, August 12, 2023
తరతరాలకు మేలు చేసే యాపిల్, తులసి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment