Monday, August 29, 2016

భూమిని చుట్టివచ్చిన తొలి సౌరశక్తి విమానం పేరు ఏమిటి?


భూమిని చుట్టివచ్చిన తొలి సౌరశక్తి విమానంగా సోలార్‌ ఇంపల్స్‌-2 రికార్డు సృష్టించింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా దీని యాత్ర పూర్తయింది. 2015 మార్చి 9న అబుదాబి విమానాశ్రయం నుంచి దీని ప్రపంచ యాత్ర మొదలైంది. చివరిసారిగా ఈజిప్టు రాజధాని కైరో నుంచి ఇది గమ్యానికి చేరింది. దీంతో 4 ఖండాలు, 2 మహా సముద్రాలు, 3 సముద్రాలను దాటుకుంటూ చేపట్టిన 42,000 కి.మీ ప్రయాణం పూర్తయింది. కారు కంటే తక్కువ బరువుండే సోలార్‌ ఇంపల్స్‌లో4 ఇంజన్‌లు ఉన్నాయి. రెక్కల్లో ఏర్పాటుచేసిన దాదాపు 17,000 సౌరఘటాలు వీటికి కావల్సిన సౌరశక్తిని అందిస్తున్నాయి. గంటకు 80 కి.మీ. వేగంతో ఇది ప్రయాణిస్తుంది. 2015 మార్చి 10న ఒమన్‌లోని మస్కట్‌ నుంచి ఈ విమానం అహ్మదాబాద్‌కు, మార్చి 18న అహ్మదాబాద్‌ నుంచి వారణాసికి చేరుకుంది. మార్చి 19న వారణాసి నుంచి మయన్మార్‌లోని మాండలేకు చేరింది. స్విట్జర్లాండ్‌ వాసి బెర్ట్‌ర్యాండ్‌ పికార్డ్‌ సోలార్‌ ఇంపల్స్‌-2ను నడిపారు.

No comments:

Post a Comment