భారత్-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం కోసం పెట్రాపోల్-బెనాపోల్ నడుమ ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసీపీ)ని ప్రధాని నరేంద్రమోడి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సగానికి సగం పెట్రాపోల్-బెనాపోల్ ద్వారానే అవుతుందని అంచనా. భద్రతతో పాటు కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ లాంటివన్నీ ఒకేచోట సమర్థంగా పూర్తయ్యేలా దీన్ని తీర్చిదిద్దారు. సరకుతోపాటు ప్రజలు సరిహద్దులు దాటి రాకపోకలు చేయడాన్ని సులభతరం చేసే సదుపాయాలు దీనిలో ఉంటాయి. ఈ సరిహద్దు కేంద్రం ద్వారా ఏటా 15 లక్షల మంది ప్రజలతోపాటు 1,50,000 ట్రక్కుల రాకపోకలు చేసే అవకాశం ఉంది.
ICP - Integrated Check Post
No comments:
Post a Comment