Saturday, August 27, 2016

యూఎన్‌ఓ సర్వప్రతినిధి సభలో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత విభావరి


భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్‌లోని యూఎన్‌ఓ సర్వప్రతినిధి సభలో ఆస్కార్‌ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తన బృందంతో సంగీత విభావరి నిర్వహించారు. విశ్వవిఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి దివంగత ఎంఎస్‌ సుబ్బలక్ష్మి నాడు ఆలపించిన రాగాలను ఏఆర్‌ రెహమాన్‌ ఆలపించారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభా ప్రాంగణంలో కచేరి నిర్వహించిన తొలి భారత సంగీత ద్రష్టగా చరిత్రలో నిలిచిపోయిన ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి శత జయంతి సంవత్సరం ఇది. ఆమె ఆ వేదికపై కచేరి చేసిన వజ్రోత్సవం కూడా. 1996లో అప్పటి యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్‌ యూథాంట్‌ ఆహ్వానం మేరకు ఎంఎస్‌ అక్కడ కచేరి నిర్వహించారు. ఎంఎస్‌ శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీలో ఆమె జీవితంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించే ఫొటో ప్రదర్శనలను ప్రారంభించారు. ఇన్ని ప్రత్యేకతల నేపథ్యంలో ఆమెకు ఘన నివాళిగా రెహమాన్‌ తన సంగీత విభావరి నిర్వహించారు. ఎంఎస్‌ తర్వాత యూఎన్‌ఓలో కచేరి చేసిన రెండో వ్యక్తిగా రెహమాన్‌ గౌరవాన్ని పొందారు

No comments:

Post a Comment