సంఘటిత రంగంలోని మహిళా ఉద్యోగులకు ఇచ్చే వేతనంతో కూడిన ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. ఈ మేరకు ప్రసూతి సౌకర్యాల సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. కేబినెట్ 2016 ఆగస్టు 10న బిల్లుకు తదనంతర ఆమోదం తెలిపింది. దీంతో కనీసం 10 మంది ఉద్యోగులున్న ప్రతి కంపెనీలో మహిళా ఉద్యోగులకు 26 వారాలు ప్రసూతి సెలవు లభించనున్నాయి. జీవించి ఉన్న ఇద్దరు పిల్లల వరకు 26 వారాలు ప్రసూతి సెలవు వర్తిస్తుంది. ఆ తర్వాత నుంచి 12 వారాలు వర్తిస్తుంది. అద్దె గర్భం(సరోగసీ) ద్వారా తల్లి హోదాను పొందిన మహిళలకు,పిల్లలను దత్తత తీసుకున్న తల్లులకూ 12 వారాలు ప్రసూతి సెలవును వర్తింపజేయనున్నారు. 50 మందికి మించి ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థలో శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రసూతి సెలవులు ఎక్కువగా ఇస్తున్న దేశాలు
1. కెనడా 50 వారాలు
2. నార్వే 44 వారాలు
3. భారత్ 26 వారాలు
No comments:
Post a Comment