మూడు రాష్ట్రాలకు గవర్నర్లను, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ 2016 ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. 75 ఏళ్ల వయసు దాటిన సందర్భంగా ఆమెను ఇటీవలే కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించారు. గతంలో నాగ్‌పూర్ నుంచి మూడుసార్లు ఎంపీగా నెగ్గిన బన్వారీలాల్ పురోహిత్ అసోం గవర్నరుగా నియమితులయ్యారు. ది హిందుత్వ పత్రికకు ఆయన మేనేజింగ్ ఎడిటర్‌గా కూడా ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన వీపీ సింగ్ బద్నోర్ పంజాబ్ గవర్నర్‌గా నియమితుయ్యారు. అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నరుగా ఢల్లీకి చెందిన బీజేపీ నేత, మాజీ శాసనసభ సభ్యుడు ఆచార్య జగదీష్‌ముఖి నియమితుయ్యారు.
నజ్మాహెప్తుల్లా - మణిపూర్
నజ్మాహెప్తుల్లా - మణిపూర్
బన్వారీలాల్ పురోహిత్ - అసోం
వీపీ సింగ్ బద్నోర్ - పంజాబ్
ఆచార్య జగదీష్‌ముఖి - అండమాన్ నికోబార్
No comments:
Post a Comment