Wednesday, August 24, 2016

దేశంలో ఏటా 1.30 లక్షల మంది ఆత్మహత్యలు


దేశవ్యాప్తంగా ఏటా 1.30 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఇందులో విద్యార్థుల సంఖ్య 8 వేలకుపైగా ఉంటుందని వెల్లడించింది. 2012-14 మధ్యకాలంలో మొత్తం 4.01లక్షల మంది అర్ధంతరంగా తనువు చాలించినట్లు తెలిపింది. వీరిలో 2.68 లక్షల మంది పురుషులు, 1.33 లక్షల మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం లోక్‌సభలో  వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్‌బంగాల్లో ఆత్మహత్య ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య ఏటా సగటున 14వేలకు పైగా ఉండగా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 6 వేలు, తెలంగాణలో 9 వేలకు పైగా నమోదయ్యాయి. 2012-14 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 23,140 మంది విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించారు.

No comments:

Post a Comment