Friday, August 26, 2016

7వ వేతన సంఘం సిఫారసుకు కేంద్రం ఆమోదం


7వ వేతన సంఘం సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
- పదవీ విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక కనిష్టంగా రూ.9 వేల పింఛను అందుకోనున్నారు. ప్రస్తుతం అది రూ.3500గా ఉంది
- గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. కరవు భత్యం 50 శాతం మేర పెరిగినప్పుడల్లా గ్రాట్యుటీపై పరిమితిని 25 శాతం మేర పెంచాలని సూచించింది
- గరిష్ట పింఛను మొత్తాన్ని 50 శాతం మేర పెంచి, దాన్ని రూ.1.25 లక్షలుగా నిర్ధారించారు.
- పౌర, రక్షణ బలగాలకు చెందిన సిబ్బంది మరణించినప్పుడు వారి బంధువులకు ఏక మొత్తంగా ఇచ్చే పరిహారాన్ని కూడా పెంచారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాల వల్ల, ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు తదితరుల చర్యల వల్ల  తలెత్తే హింసలో మరణించినప్పుడు రూ.25 లక్షల పరిహారం ఇస్తారు. అది ప్రస్తుతం రూ.10 లక్షలుగా  ఉంది.
- సరిహద్దుల్లో ఘర్షణలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సముద్ర దొంగలపై చర్యలు తీసుకునే క్రమంలోనూ, విపత్తు, నిర్దేశిత ఎత్తయిన ప్రదేశాల్లోనూ, మారుమూల ఉండే సరిహద్దు శిబిరాల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రకృతి విపత్తులు, ప్రతికూల  వాతావరణ కారణంగా మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.15 లక్షల నుంచి రూ.35 లకేశాలకు పెంచారు.
- యుద్ధం, యుద్ధం లాంటి పరిస్థితుల్లో శత్రువుల చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు  మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.20 లక్షల నుంచి రూ.45లక్షలకు పెంచారు

No comments:

Post a Comment