కేంద్రం ప్రాణావసర ఔషధాల ధరను తగ్గించింది. క్యాన్సర్, హెచ్‌ఐవీ, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, ఆందోళన, హృద్రోగ చికిత్సల్లో ఉపయోగించే ఔషధాల ధరల్ని ప్రభుత్వం సగటున సుమారు 25 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 24 రకాల తప్పనిసరి ఔషధాల ధరపై స్థిరీకరణ/సవరణ చేపట్టినట్లు జాతీయ ఔషధ ధర నిర్ణయ ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరో 31 రకాల చిల్లర ధరపై పరిమితుల్ని విధించినట్లు వెల్లడించింది.
No comments:
Post a Comment