Wednesday, August 24, 2016

మారుమూల ప్రాంతాలను ఇంటర్నెట్‌ సేవలకు ఫేస్‌బుక్‌ డ్రోన్‌ ‘ఆక్విలా’


మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవలందించేందుకు రూపొందించిన డ్రోన్‌ను ఫేస్‌బుక్‌ విజయవంతంగా తొలిసారి పరీక్షించింది. సౌర విద్యుత్తుతో నడిచే ఈ డ్రోన్‌ పేరు ఆక్విలా. తక్కువ ఎత్తులో 90 నిమిషాలకు పైగా ఆక్విలా గగన విహారం చేసినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే లేజర్‌ కమ్యూనికేషన్లు, మిల్లీమీటరు తరంగ వ్యవస్థతో 96.6 కిలోమీటర్ల వ్యాసం పరిధిలో, 18,288 మీటర్ల ఎత్తు నుంచి ఆక్విలా ఇంటర్నెట్‌ సేవలు అందించగలదని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

No comments:

Post a Comment