Tuesday, August 23, 2016

ప్రపంచంలోనే మొదటి క్వాంటమ్‌ ఉపగ్రహం మికియస్‌


ప్రపంచంలోనే మొదటి క్వాంటమ్‌ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. దీని ద్వారా అంతరిక్షం నుంచి భూమికి కాంతి కంటే వేగవంతమైన, హ్యాకింగ్‌కు ఆస్కారం లేని కమ్యూనికేషన్లను సాగించడానికి వీలు కలుగుతుంది. క్వాంటమ్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ ఎట్‌ స్పేస్‌ స్కేల్‌ (క్వెస్‌) అనే ప్రాజెక్టు కింద ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీన్ని 5వ శతాబ్దం నాటి చైనా తత్వవేత్త, శాస్త్రవేత్త పేరిట మికియస్‌ అని వ్యవహరిస్తున్నారు. మానవ చరిత్రలో తొలిసారిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ ఉపగ్రహం బరువు 600 కిలోలు. దీన్ని గోబీ ఎడారిలోని జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌ మార్చ్‌- 2డి రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 2 సం॥ పాటు సేవలందిస్తుంది. క్వాంటమ్‌ భౌతిక శాస్త్రంలో అంతుపట్టని క్వాంటమ్‌ ఎంటాంగిల్‌మెంట్‌ అనే ప్రక్రియపై లోతైన అవగాహన కల్పిస్తుందని భావిస్తున్నారు.

QUESS - Quantum Experiments at Space Scale

No comments:

Post a Comment