Thursday, August 18, 2016

ఎల్‌నినో స్థానంలో రానున్న వాతావరణ పోకడ ఏమిటి..?

ఏడాదిగా ప్రపంచ వాతావరణంపై పెను ప్రభావాన్ని చూపిన ఎల్‌నినో ముగిసిపోయిందని, రానున్న కొన్ని నెలల్లో దీని స్థానంలో లానినా వాతావరణ పోకడ తలెత్తవచ్చని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ తెలిపింది. ఎల్‌నినో వల్ల వర్షపాత తీరుతెన్నుపై ప్రభావం పడుతుంది. కొన్ని చోట్ల వరదను, మరికొన్ని చోట్ల కరవును ఇది కలిగిస్తుంది. లానినా వల్ల కొన్నిసార్లు ప్రపంచవ్యాప్తంగా అధిక వర్షపాతం, తుపాన్లు, హిమపాతం సంభవిస్తుంది. పసిఫిక్‌ మహాసముద్ర జలాలు  చల్లబడటం వల్ల ఈ వాతావరణ పోకడ వృద్ధి చెందుతుంది. లానినా ఏర్పడినా అత్యంత ఉష్ణ ఏడాదిగా 2016 సంవత్సరం రికార్డుల్లోకి ఎక్కబోతోంది. ఈ ఏడాదిలో మొదటి 6 నెలల్లో రికార్డు ఉష్ణోగ్రతలు  నమోదు కావడమే ఇందుకు కారణం. 


No comments:

Post a Comment