ప్రభుత్వం, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని సంస్థల ప్రత్యక్ష నియామకాలల్లో (పురుషులు, మహిళలు ఇద్దరూ అర్హమైన పోస్టులు) మహిళలకు 33.33% ప్రత్యేక రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓసీ, బీసీల్లోని అన్ని గ్రూపులు, ఎస్సీ, ఎస్టీ, శారీరక దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారుల విభాగాలన్నింటిలో దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది.
No comments:
Post a Comment