ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ 2016 ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికపై పాట కచేరీ నిర్వహించారు. ఇప్పటివరకు అనాటి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఎం.ఎస్.సుబ్బలక్ష్మి 1966లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన గాన మాధుర్యాన్ని వినిపించారు. సమితిలో కచేరీ చేసిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రెహమాన్‌కు ఆ అవకాశం దక్కింది.
No comments:
Post a Comment