Monday, August 22, 2016

టీ.ఎం.కృష్ణ, బెజవాడ విల్సన్‌కు రామన్‌ మెగసెసె అవార్డు`2016


2016 సం॥నికి గాను రామన్‌ మెగసెసె అవార్డుకు ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. కర్ణాటక సంగీత గాయకుడు టీ.ఎం.కృష్ణ, సఫాయీ కర్మచారి ఆందోళన్‌ జాతీయ కన్వీనర్‌ బెజవాడ విల్సన్‌కు రామన్‌ మెగసెసె అవార్డు-2016 లభించింది. వీరితోపాటు కొంచిత కార్పియా మొరేల్స్‌ (ఫిలిప్పీన్స్‌), డాంపెట్‌ ధువాఫ (ఇండోనేషియా), జపాన్‌ ఓవర్సీస్‌ కోఆపరేషన్‌ వాంటీర్స్‌, వియంటైన్‌ రెస్క్యూ(లావోస్‌)ను కూడా 2016 సం॥నికి గాను ఈ పురస్కారానికి ఎంపికచేశారు. అభివృద్ధి చెందుతున్న నాయకత్వం కేటగిరీ కింద విల్సన్‌ (50), కృష్ణ (40)కు ఈ పురస్కారం దక్కింది. మానవ విసర్జితాన్ని దళితుల్లో ఒక వర్గం చేత ఎత్తి శుభ్రం చేయించే వృత్తిని రూపుమాపడానికి విల్సన్‌ 32 ఏళ్లుగా చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. సంగీతం ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకూడదని, అన్ని వర్గాలకు అది చెందాలని, ఈ రంగంలో వివక్షను రూపుమాపాలని కృషి చేస్తున్నందుకు టి.ఎం.కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కృష్ణ రచించిన ‘సదరన్‌ మ్యూజిక్‌’ పుస్తకం అనేక ప్రకంపనాలు సృష్టించింది.
రామన్‌ మెగసెసె అవార్డు

రామన్‌ మెగసెసె అవార్డును ఆసియాలోనే అత్యుత్తమ గౌరవంగా భావిస్తారు.
ఫిలిప్పీన్స్‌ మూడో అధ్యక్షుడు రామన్‌ మెగసెసె జ్ఞాపకార్థం 1958 నుంచి దీన్ని అందిస్తున్నారు.
ప్రజాసంక్షేమం కోసం, వారిని చైతన్య పరిచేందుకు ఆసియా దేశాల్లో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తుల, సంస్థలకు ఈ అవార్డును ఏటా అందిస్తారు.

No comments:

Post a Comment