Thursday, September 22, 2016

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య 18 ఒప్పందాలు

   ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ భారత్‌ పర్యటనలో భాగంగా 2016 జనవరి 24న ఇరుదేశాల మధ్య 16 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో హెలికాప్టర్ల తయారీ, పట్టణాభివృద్ధి, రవాణా, నీరు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సౌర విద్యుత్తు మొదలైన అంశాలు ఉన్నాయి. 3 రోజుల పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌ చండీగఢ్‌లో భారత్‌-ఫ్రాన్స్‌ వ్యాపారవేత్త సదస్సులో పాల్గొన్నారు. అంతర్జాతీయ సౌర విద్యుత్‌ దేశాల కూటమి (ఐఎస్‌ఏ) తాత్కాలిక కార్యాయాలన్ని న్యూఢల్లీ సమీపంలోని గుర్గావ్‌లో ప్రారంభించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ ప్రాంగణంలో ఐఎస్‌ఏ ప్రధాన కార్యాయల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హోలండ్‌ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ నుంచి 36 రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జనవరి 25న సంతకాలు జరిగాయి. దాదాపు రూ. 60 వేల కోట్ల విలువైన 36 ఫైటర్‌ జెట్లను ‘విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న స్థితిలో కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందాన్ని 2015లో మోదీ ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ప్రకటించారు.

No comments:

Post a Comment