భారత్, ఆర్మేనియాల మధ్య సవరించిన ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా ఇరు దేశాలు బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఫలితంగా పన్ను ఎగవేతలు తగ్గుతాయని అంచనా. ప్రస్తుతం అమల్లో ఉన్న ద్వంద్వ పన్నుల నివారణ కన్వెన్షన్‌కు సంబంధించి సవరణపై భారత్, ఆర్మేనియా దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నల్లధనం పోగుపడకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఈ ఒప్పందంతో మరింత శక్తివంతం అవుతాయని పేర్కొంది. ఇరు దేశాల మధ్య 2004, సెప్టెంబర్ 9న డీటాక్ ఒప్పందం కుదిరింది.
No comments:
Post a Comment