భారత టిబెట్ సరిహద్దు భధ్రతా దళంలో నేరుగా అధికారులుగా చేరేందుకు మహిళలకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. సంక్లిష్టమైన భారత్ చైనా సరిహద్దును పరిరక్షించడం ఈ దళం ప్రధాన విధి. ఇందులో సంక్లిష్టతల దృష్ట్యా ఇప్పటివరకూ ఈ దళంలో పర్యవేక్షక పోరాట విధుల్లో మహిళలను అనుమతించలేదు. మిగతా నాలుగు దళాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సహస్త్ర సీమాబల్‌లోఈ వెసులుబాటు ఇప్పటికే అమల్లో ఉంది.
No comments:
Post a Comment