Sunday, September 25, 2016

నూతన విధివిధానాలకు రాజ్యసభ ఛైర్మన్‌ ఆమోదం

రాజ్యసభ సమావేశాల నిర్వహణలో లేనప్పుడు సభ్యుడు/సభ్యురాలు మరణిస్తే తదుపరి సమావేశాల తొలి రోజున సభను పూర్తిగా వాయిదా వేసే పాతకాలపు పద్ధతికి స్వస్తి పలికారు. సభను రోజు మొత్తంగా వాయిదా వేయకుండా, దివంగత సభ్యుల జ్ఞాపకార్థం గంటసేపు నివాళి నిర్వహించి ఆ తర్వాత సభను వాయిదా వేయాలంటూ సాధారణ ప్రయోజనా కమిటీ చేసిన సిఫాసును రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదించారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ్యుడు/సభ్యురాలు మృతి చెందితే సభను ఒకరోజుపాటు వాయిదా వేసే సంప్రదాయం మాత్రం కొనసాగనుంది. నూతన విధివిధానాల ప్రకారం ఇకపై ఎగువసభలో సభ్యత్వం లేని మంత్రి ఢల్లీలో మరణిస్తే అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు లేదా పార్ధివదేహాన్ని వారి స్వస్థలానికి పంపే కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా సభ ఒక రోజుపాటు వాయిదా పడుతుంది. లోక్‌సభ ఎంపీగా ఉన్న జాతీయ పార్టీ అధ్యక్షులు దివంగతులైతే(ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్య ఉండాలి). సభ ఒక రోజు పాటు వాయిదా పడుతుంది. 

No comments:

Post a Comment