UPSC చైర్‌పర్సన్‌గా అల్కా సిరోహి
M
-మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అల్కా సిరోహి యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్న ఆమె.. 2017 జనవరి 3 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
A
పార్టీ మారిన అరుణాచల్ సీఎం
-అరుణాచల్‌ప్రదేశ్ సీఎం ఫెమా ఖండూ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలతో కలిసి పీపుల్స్ పార్టీ ఆఫ్ ఆరుణాచల్‌ప్రదేశ్‌లో చేరిపోయారు. దీంతో అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఒకటికి పడిపోయింది. ప్రస్తుతం మాజీ సీఎం నబం టుకీ ఒక్కడే కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు.
N
LIC చైర్మన్‌గా వీకే శర్మ
-LIC చైర్మన్‌గా సెప్టెంబర్ 16న వీకే శర్మ బాధ్యతలు స్వీకరించారు. 1981లో డైరెక్ట్ రిక్రూట్ అధికారిగా LICలో శర్మ ఉద్యోగ జీవితం ప్రారంభమైంది.
I
అమ్మ ఫంక్షన్ హాళ్లు
-తమిళనాడు ప్రభుత్వం రూ. 83 కోట్లతో చేపట్టిన అమ్మ ఫంక్షన్‌హాళ్ల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17న ఆ రాష్ట్ర సీఎం జయలలిత ప్రారంభించారు. మొదటగా వీటిని చెన్నై నగరం, మధురై, తిరునళ్వేలి, సేలం, తిరువల్లూర్, తిరువూరు జిల్లాల్లో నిర్మించనున్నారు.
K
అంతర్జాతీయం
నేపాల్ ప్రధాని భారత పర్యటన
U
-నేపాల్ ప్రధాని ప్రచండ సెప్టెంబర్ 14 నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రధానులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ నేపాల్‌కు 750 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు. నేపాల్‌లోని తెరాయి ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలను మెరుగుపర్చడానికి, అధునీకరించడానికి భారత్‌తో ఒప్పందం కుదిరింది.
M
ఆసియా బెస్ట్-25లో 5 భారత మ్యూజియంలు
-ఆసియాలో ఎంపికచేసిన 25 అత్యుత్తమ మ్యూజియంల జాబితాలో 5 భారత మ్యూజియంలకు చోటు లభించింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం లేహ్‌లోని హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం మొదటగా గుర్తింపు పొందిందని ట్రావెలర్స్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. జాబితాలోని మిగతా 4 భారత మ్యూజియంలలో ఉదయ్‌పూర్‌లోని బాగోర్ కీ హవేలీ, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్, హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం, జైసల్మేర్‌లోని జైసల్మేర్ వార్ మ్యూజియంలు ఉన్నాయి.
A
క్రీడలు
రోస్‌బర్గ్ డబుల్ హ్యాట్రిక్
R
-ఫార్ములావన్ రేసులో మెర్సిడెజ్ జట్టు డ్రైవర్, జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ మరో విజయం నమోదుచేశాడు. సెప్టెంబర్ 18న జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు. మొత్తం 61 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ 55 నిమిషాల 48.950 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ సీజన్లో 2 సార్లు వరుసగా మూడు టైటిల్స్ (డబుల్ హ్యాట్రిక్) సాధించిన ఫార్ములావన్ డ్రైవర్‌గా నిలిచాడు.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ విజేత వావ్రింకా
మ
-యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విస్ ఆటగాడు స్టాన్లిస్ వావ్రింకా మొదటిసారి గెలిచాడు. సెర్బియా ఆటగాడు జకోవిచ్‌ను ఓడించి ఈ ఘనత సాధించాడు.
ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్ మనీషా
ణి
-హర్యానాకు చెందిన రెజ్లర్ మనీషా.. జార్జియాలోని తిబిలిసిలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 15న 38 కిలోల విభాగం ఫైనల్‌లో బల్గేరియా క్రీడాకారిణి జర్కోవా దెల్చేవాను 2-1 తేడాతో ఓడించి స్వర్ణం సాధించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
కు
మార్మగోవా యుద్ధనౌక జలప్రవేశం
-రక్షణరంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మార్మగోవా యుద్ధనౌకను నావికాదళ ప్రధానాధికారి ముంబై వద్ద అరేబియా సముద్రంలో ప్రారంభించారు. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. ఈ యుద్ధనౌక బరువు 3,700 టన్నులు, గరిష్ట వేగం 30 నాట్స్. ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులతోపాటు జలాంతర్గామి విధ్వంసక రాకెట్లను కూడా ఈ యుద్ధనౌక పైనుంచి ప్రయోగించే వీలుంటుంది.
మా
లాంగ్‌మార్చ్ ఎఫ్ టీ2 రాకెట్ ద్వారా తియాంగాంగ్-2 ల్యాబ్‌ను చైనా సెప్టెంబర్ 15న అంతరిక్షంలోకి పంపింది. దీని బరువు 8.6 టన్నులు, వ్యాసం 3.35 మీ., ల్యాబ్ పొడవు 14.4 మీ.
వార్తల్లో వ్యక్తులు
ర్
హక్కుల నేత బొజ్జా తారకం మృతి
-ప్రముఖ పౌరహక్కుల నేత, కవి, రచయిత బొజ్జా తారకం సెప్టెంబర్ 16న మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పౌరహక్కుల ఉద్యమంలో బొజ్జా తారకం క్రియాశీలకంగా పనిచేశారు. కులం-వర్గం, నది పుట్టిన గొంతుక, నేల నాగలి-మూడెద్దులు, పంచతంత్రం, నాలాగే గోదావరి, దళితులు-రాజ్యం వంటి పుస్తకాలను ఆయన రచించారు.
భారత సంతతి వ్యక్తికి అత్యున్నత పదవి
M
-ప్రపంచవ్యాప్తంగా సురక్షిత రక్తమార్పిడికి కృషి చేస్తున్న అంతర్జాతీయ రక్తమార్పిడి సంఘం (ఐఎస్‌బీటీ) అధ్యక్షుడిగా దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి వ్యక్తి రవిరెడ్డి ఎంపికయ్యారు. ఆఫ్రికా ఖండం నుంచి ఈ సంస్థకు అధిపతిగా నియమితులైన తొలి వ్యక్తి కూడా ఈయనే. రవిరెడ్డి ప్రస్తుతం దక్షిణాఫ్రికా జాతీయ రక్త సేవల సంస్థకు చీఫ్ ఆపరేషన్స్ అధికారిగా ఉన్నారు.
ఐరాస గుడ్‌విల్ అంబాసిడర్‌గా నదియా
A
-ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అకృత్యానికి బలై, నెలల తరబడి బానిసగా నరకం అనుభవించిన నదియా మురద్‌ను సెప్టెంబర్ 16న ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించారు. ఉగ్రవాద సంస్థ దురాగతాల గురించి నదియా ప్రపంచానికి చాటిచెప్పి ప్రజల్లో అవగాహన తీసుకురానుంది.
ఎడ్వర్డ్ అల్బీ మృతి
N
-అమెరికా నాటకరంగ దిగ్గజం ఎడ్వర్డ్ అల్బీ సెప్టెంబర్ 17న మరణించారు. ఈయనకు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డు మూడుసార్లు లభించింది. హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ అనే నాటక రచనతో ప్రపంచప్రసిద్ధిగాంచారు. ఆయన తొలి నాటకం జూ స్టోరి.
I
ప్రవాస భారతీయునికి బ్రిటన్ అవార్డు
-ప్రవాస భారతీయుడు నరేంద్ర బాబుపటేల్‌కు బ్రిటన్ ప్రభుత్వ జీవిత కాల సాఫల్య పురస్కారం లభించింది.
సాధారణ పరిజ్ఞానం
-ఉత్తర ధృవాన్ని చేరుకున్న తొలి వ్యక్తి? - రాబర్ట్ పియరీ (1909)
-దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి వ్యక్తి? - అముండ్ సేన్ (నార్వే, 1911)
-ఉత్తర ధృవాన్ని చేరుకున్న తొలి మహిళ? - కరోలిన్ మికెల్‌సేన్ (1935)
-దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి మహిళ? - ఫ్రాన్స్ ఫిప్స్ (1971)
-భారత అణుశక్తి పితామహుడు? - హెచ్‌జే బాబా
-పెట్రోల్ కారును ఆవిష్కరించినవారు? - కార్ల్ బెంజ్
-డైనమైట్‌ను ఆవిష్కరించిన వారు? - ఆల్ఫ్రెడ్ నోబెల్
-అయోడిన్‌ను కనుగొన్నది ఎవరు? - బీ కూర్టోయిస్
-భారతరత్న పొందిన మహిళల సంఖ్య? - ఐదుగురు
-మరణాంతరం భారతరత్నను పొందిన వారి సంఖ్య? - 13

No comments:
Post a Comment