Monday, September 19, 2016

అణు కర్మాగారాల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకున్న భారత్‌, పాకిస్థాన్‌

అణు స్థావరాలపై పరస్పర దాడుల నిరోధక ఒప్పందంలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌లు తమ దేశాల్లోని అణు కర్మాగారాల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకున్నాయి. 1992లో ప్రారంభమైన ఈ ప్రక్రియ తాజా మార్పిడితో నిరంతరాయంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 1న తమ అణు స్థావరాల వివరాలు ఇచ్చిపుచ్చుకోవాని 1988 డిసెంబరు 31న భారత్‌ - పాక్‌ కుదుర్చుకున్న ఒప్పందం 1991, జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే తమ కారాగారాల్లోని పొరుగు దేశ ఖైదీ జాబితాను కూడా ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో మార్పిడి చేసుకోవాలని 2008, మే 31న రెండు దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి.

No comments:

Post a Comment