నిరుపేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ (ఎల్పీజీ కనెక్షన్లను) అందించేందుకు ఉద్దేశించిన రూ.8 వేల కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2016 మార్చి 10న ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈమేరకు ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’కు పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి కేటాయించిన రూ.8 వేల కోట్ల నిధులను మూడేళ్లలో వినియోగిస్తారు. దారిద్యరేఖకు దిగువన ఉన్న మహిళలకు యుద్ధప్రాతిపదికన గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడం దీని ఉద్దేశం.
No comments:
Post a Comment