దేశాన్ని విపత్తుల నుంచి కాపాడటమే లక్ష్యంగా చేసిన మొదటి జాతీయ ప్రణాళికను ప్రధాని నరేంద్రమోడి ఢల్లీలో ఆవిష్కరించారు. జాతీయ విపత్తుల నిర్వహణ ప్రణాళిక పేరుతో దీన్ని రూపొందించారు. విపత్తుల నిర్వహణ చక్రంలోని అన్ని దశల్లో (నియంత్రణ, ఉపశమనం, ప్రతిస్పందన, పూర్వస్థితికి రావడం) వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇది మార్గనిర్దేశం చేసే వీలుంది. విపత్తుల ముప్పు తగ్గించేందుకు రూపొందించిన సెండాయ్ నిబంధనలు లోని కొన్ని లక్ష్యాలు, ప్రాథమ్యాలు ఎన్‌డీఎంపీలోనూ కనిపిస్తున్నాయి. 2015 మార్చిలో జపాన్ నగరం సెండాయ్‌లో జరిగిన ‘విపత్తుల ముప్పు తగ్గించేందుకు మూడో ఐరాస ప్రపంచ సదస్సు’లో SFDRRను ఆమోదించారు. దీనిలో ఏడు స్పష్టమైన లక్ష్యాలు, నాలుగు ప్రాథమ్యాలను పొందుపరిచారు. అయితే ప్రస్తుత NDMPలో ప్రతిస్పందన విషయంలో 18 కీలక చర్యలను ప్రతిపాదించారు.
No comments:
Post a Comment