Thursday, September 22, 2016

‘అడ్వాన్సింగ్‌ ఉమెన్స్‌ ఎడ్యుకేషన్‌’ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం

ఉన్నతవిద్యలో మహిళ పరిస్థితిని అంచనా వేసేందుకు తెలంగాణ కళాశాల విద్యాశాఖ రూపొందించిన అడ్వాన్సింగ్‌ ఉమెన్స్‌ ఎడ్యుకేషన్‌ పైలట్‌ ప్రాజెక్టును కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ 2016 జూన్‌ 3న ఢల్లీ నుంచి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముందుగా చేపడతారు. ఆ జిల్లాలో మహిళల ఉన్నత విద్య ఎలా ఉంది? ఎక్కడ తక్కువ, ఎక్కువ ఉంది? మౌలిక వసతులు కల్పించిన కళాశాలల్లో వారి సంఖ్య పెరిగిందా? లేదా? తదితర అంశాలపై అధ్యయనం చేస్తారు. వాటిని మ్యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చూసుకునేలా తయారుచేస్తారు. దీన్నే ‘డిజిటల్‌ జెండర్‌ అట్లాస్‌’గా పిలుస్తారు. డిగ్రీ కళాశాలల్లో నూతన విద్యాసంవత్సరం నుంచి లింగ వివక్ష నిర్మూలనపై ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టనున్నారు. ‘టూవార్డ్స్‌ ఏ వరల్డ్‌ ఆఫ్‌ ఈక్వల్స్‌’ పేరిట ఆంగ్లం, తెలుగులో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఢల్లీలో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆత్మకూరులో నెలకొల్పిన ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలను ఢల్లీలోని శాస్త్రీభవన్‌ నుంచి ఆమె డిజిటల్‌ లాంచ్‌ విధానం ద్వారా ప్రారంభించారు.

No comments:

Post a Comment