Friday, September 30, 2016

అణుబాంబును పరీక్షించిన ఉత్తర కొరియా

కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధం(వార్‌హెడ్‌)తో అణుబాంబును శాస్త్ర్తవేత్తలు విజయవంతంగా పరీక్షించారని ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ చానల్‌ 2016 సెప్టెంబర్‌ 8న వెల్లడించింది. దీంతో రాకెట్‌కు చిన్న అణు వార్‌హెడ్‌ను అనుసంధానించే సామర్థ్యాన్ని కొరియా సంపాదించుకుంది. ఇది ఉత్తర కొరియా ఐదో అణు పరీక్ష, ఈ పరీక్షతో పుంగ్యెరి అణు కేంద్రం సమీపంలో రిక్టర్‌ స్కేలుపై 5.3 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించింది. దీంతో ఉత్తర కొరియాపై ఆర్థికపరమైన ఆంక్షలతో దానిని ఒంటరిని చేయాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.

No comments:

Post a Comment