Wednesday, September 21, 2016

ఉగ్రవాదంపై భారత్‌, యూఎస్‌ కీలక ఒప్పందం

 ఉగ్రవాదంపై పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవాలని భారత్‌, అమెరికా దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిని అనుసరించి ఉగ్రవాదులు, అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించిన జీవిత చరిత్రలతో సహా వారి సమాచారాన్ని ఇరు దేశాలు పరస్పరం అందజేసుకోవాలి. ఈ మేరకు ఒప్పందంపై 2016 జూన్‌ 2న హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహ్రిషి, అమెరికా రాయబారి రిచర్డ్‌ సంతకాలు చేశారు. ఇరుదేశాల్లో స్థిర అభివృద్ది కోసం ఇంధన భద్రత, వాతావరణ మార్పుల విషయంలో పరస్పరం సహకారం పెంపొందించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

No comments:

Post a Comment