అటల్ పెన్షన్ యోజన పథకానికి చెల్లించే చందా విషయమై కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2016 మార్చి 22న ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా సవరణ ప్రకారం. ఏపీవై చందాదారులెవరైనా మరణించినా వారి భార్య లేదా భర్త (జీవిత భాగస్వామి) ఈ పెన్షన్ ఖాతాను కొనసాగించవచ్చు. నిర్ణీత గడువు పూర్తయ్యే వరకూ (చందాదారుడికి 60 ఏళ్లు పూర్తయి ఉండే సమయం వరకు) వారు చందా చెల్లిస్తే.. వారికి జీవితాంతం నెలనెలా నిర్ధారిత పెన్షన్ మొత్తం అందుతుంది. భాగస్వామి కూడా మరణించాక వారి నామినీకి ఏకమొత్తంగా పెన్షన్ సొమ్మును చెల్లిస్తారు.
No comments:
Post a Comment