Tuesday, September 20, 2016

కొలంబియా ప్రభుత్వంతో ఫార్క్‌ శాంతి ఒప్పందం


వామపక్ష తీవ్రవాద సంస్థ, కొలంబియా విప్లవ సాయుధ బలగాల(ఎఫ్‌ఏఆర్సీ-ఫార్క్‌)తో ఆ దేశ ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరుపక్షాలు క్యూబా రాజధాని హవానాలో 2016 ఆగస్టు 24న ప్రకటన విడుదల చేశాయి. దీంతో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో 1964లో ప్రారంభమైన అంతర్యుద్దానికి తెరపడనుంది. దీనివల్ల ఇప్పటివరకు 2.6 లక్షల మంది మరణించగా, 68 లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు. 

No comments:

Post a Comment