Thursday, September 22, 2016

సౌదీ అరేబియాతో భారత్‌ 5 ఒప్పందాలు

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద వ్యతిరేక అంశాలతో పాటు పలు కీలకాంశాల్లో సహకారాన్ని కొనసాగించాలని భారత ప్రధాని నరేంద్రమోడి, సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ నిర్ణయించారు. 2016 ఏప్రిల్‌ 3న సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన విస్తృతస్థాయి చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా 5 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రధాని మోడికి సౌదీ ప్రభుత్వపు అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ అబ్దుల్లా’ను రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అందజేశారు. సౌదీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడి సౌదీ రాజకు కేరళలోని ‘చెరమన్‌ జమా మసీదు’ బంగారు ప్రతిరూపాన్ని బహుమతిగా ఇచ్చారు.

No comments:

Post a Comment