Saturday, September 17, 2016

ప్రపంచశాంతి సూచీలో భారత్‌కు 141వ స్థానం

విశ్వశాంతి సూచికలో (గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌)లో భారత్‌ చివరి వరుసలో నిలిచింది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ అత్యంత శాంతియుత ప్రాంతాల ఏవి అనే అంశంపై 163 దేశాలపై సర్వే చేసింది. ఇందులో భారత్‌కు 141వ స్థానం దక్కింది. సిరియా చిట్టచివరి స్థానం సాధించగా.. అంతకు ముందు స్థానాల్లో వరుసగా దక్షిణ సుడాన్‌, ఇరాక్‌, అఫ్గానిస్తాన్‌, సోమాలియాలు నిలిచాయి. ఐస్‌ల్యాండ్‌ మొదటి ర్యాంకు సాధించగా డెన్మార్క్‌, ఆస్ట్రియా వరుసగా 2,3 స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్‌కు 153వ స్థానం దక్కింది.

No comments:

Post a Comment