Wednesday, September 14, 2016

Telangana Bits

భాగ్యోదయం గ్రంథం రాసిన భాగ్యరెడ్డివర్మ కుమారుడు?
- ఎంబీ గౌతమ్

ఆది హిందూ ఉద్యమ పితామహుడు ఎవరు?
- భాగ్యరెడ్డి వర్మ

అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిందెవరు?
- అరిగె రామస్వామి (దళిత ఉద్యమనేత)

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైన తేదీ?
- 1947, సెప్టెంబర్ 11

కాకతీయులను శూద్రులుగా పేర్కొన్న శాసనం?
- వర్ధమానపుర శాసనం

తెలంగాణ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది?
- 2014, ఫిబ్రవరి 20న

నిజామాబాద్ జైలు గోడలపై విప్లవ గీతాలు రాసిన తెలంగాణ కవి?
- దాశరథి కృష్ణమాచార్య

అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ?
- కాకతీయ వర్సిటీ

కాళోజీ పూర్తి పేరు?
- రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ నారాయణరావు

గేట్ వే టు తెలంగాణ అని ఏ పట్టణాన్ని పిలుస్తారు?
- కోదాడ

ఐక్యరాజ్య సమితిలోని (2015, సెప్టెంబర్) జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం వచ్చిన తెలంగాణ విద్యార్థులు?
- మాలావత్ పూర్ణ (నిజామాబాద్ జిల్లా), సాదిక్ పాషా (ఖమ్మం)

తెలంగాణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి

బతుకమ్మా బతుకు రచయిత?
- శ్రీగిరిజామనోహరబాబు

పుట్టుక నీది, చావు నీది... బతుకంతా దేశానిది అన్నదెవరు?
- కాళోజీ
సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని స్థాపించిందెవరు?
- ప్రొ. కేశవరావు జాదవ్ (1969లో)

తెలంగాణలో తొలి విశ్వవిద్యాలయం?
- ఉస్మానియా యూనివర్సిటీ

నాజీ నైజాం గ్రంథ రచయిత ఎవరు?
-అయ్యపు వెంకటరమణ

తెలంగాణలో నృత్య సంబంధ కళా రూపాల్లో ఒకటి?
- థింసా

1860లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా (ఆదిలాబాద్ జిల్లాలో) పోరాటం చేసిన గోండుల నాయకుడు?
- రాంజీ గోండు

పీవీ నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణమైన ఉద్యమం?
- జై ఆంధ్ర ఉద్యమం

హైదరాబాద్ సంస్థానంలో అల్తాఫ్ బల్దా అంటే ఏ జిల్లా?
- రంగారెడ్డి

రాష్ట్ర తొలి వైద్య ఆరోగ్య శాఖామంత్రి?
- టీ రాజయ్య

ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల విజ్ఞాన సర్వస్వం రాసిన చరిత్రకారుడు?
- బీఎన్ శాస్త్రి

ఏ తీరుగ నను దయచూసెదవో ఇన వంశోత్తమ రామా అన్న తెలంగాణ వాగ్గేయ కారుడు?
- భక్త రామదాసు

పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ నృత్యకారుడు?
- నటరాజ రామకృష్ణ

నిజాం కాలంలో టంకశాలగా పేరొందిన వజీరాబాద్‌ను ప్రస్తుతం ఏమని వ్యవహరిస్తున్నారు?
- వాడపల్లి

ముల్కీ నిబంధనల అమలు గురించి ఐదు సూత్రాల పథకాన్ని తీసుకొచ్చిన ప్రధాని?
- ఇందిరాగాంధీ

విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అందించిన మొదటి గ్రంథం?
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన అబ్రహం లింకన్

No comments:

Post a Comment