కణజాలాన్ని పునఃసృష్టించే ఒక ఔషధాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని వల్ల భవిష్యత్‌లో అవయవ మార్పిడి మరింత సులువవుతుందని ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఎక్స్‌ఎంయూ-ఎంపీ 1 అనే ఈ ఔషధం కాలేయం, పేగు, చర్మంలో మరమ్మతు, పునరుజ్జీవనానికి దోహదపడుతుందని వివరించింది. ఇది అవయవం పరిమాణాన్ని నియంత్రించే హిప్పో చర్యా క్రమంలోని ఎంఎస్‌టీ 1/2 అనే కీలక సంకేత వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ వ్యవస్థ చర్యను అడ్డుకొని కణవృద్ధిని పెంపొందిస్తుందని ఎలుకపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
Friday, September 2, 2016
కణజాలాన్ని పునఃసృష్టించే ఒక ఔషధం ఎక్స్‌ఎంయూ-ఎంపీ 1
కణజాలాన్ని పునఃసృష్టించే ఒక ఔషధాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని వల్ల భవిష్యత్‌లో అవయవ మార్పిడి మరింత సులువవుతుందని ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఎక్స్‌ఎంయూ-ఎంపీ 1 అనే ఈ ఔషధం కాలేయం, పేగు, చర్మంలో మరమ్మతు, పునరుజ్జీవనానికి దోహదపడుతుందని వివరించింది. ఇది అవయవం పరిమాణాన్ని నియంత్రించే హిప్పో చర్యా క్రమంలోని ఎంఎస్‌టీ 1/2 అనే కీలక సంకేత వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ వ్యవస్థ చర్యను అడ్డుకొని కణవృద్ధిని పెంపొందిస్తుందని ఎలుకపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment