Monday, September 19, 2016

ఐసిటి అభివృద్ధి సూచీ`2015లో భారత్‌కు 131వ స్థానం

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌  2015  నవంబర్‌ 30న ఇన్ఫర్మేషన్‌ సొసైటీ నివేదిక 2015ను విడుదల చేసింది. హిరోషిమా(జపాన్‌)లో జరిగిన ప్రపంచ టెలికమ్యూనికేషన్‌/ఐసిటి ఇండికేటర్స్‌ సింపోజియం 2015లో భాగంగా దీన్ని విడుదల చేశారు. ఐసిటి అభివృద్ధి సూచీ (ఐడిఐ)లో భాగంగా ఐటిసి అభివృద్ధికి సంబంధించి 167 దేశాల మధ్య ఉన్న ప్రగతిని 2010 నుంచి ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదిక ప్రకారం భారత్‌కు 167 దేశాల జాబితాలో 131వ స్థానం దక్కింది. ఈ సర్వేలో సమాచారం, సాంకేతిక, ప్రసార రంగాల్లో అభివృద్ధిని సూచించారు. భారత్‌కు 2010లో 125వ ర్యాంకు వస్తే ఇప్పుడు 131వ ర్యాంకు వచ్చింది. ఐడిఐ యాక్సెస్‌ మరియు ఐడిఐ వాడకం జాబితాలో భారత్‌కు 135వ స్థానం లభించింది. ఐడిఐ నైపుణ్యం విషయంలో భారత్‌కు 120వ స్థానం వచ్చింది.

No comments:

Post a Comment