మానవజాతి ప్రయోజనాల జాబితాలో భారత్ 70వ స్థానంలో నిలిచింది. గుడ్ కంట్రీ ఇండెక్స్ ప్రకటించిన ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో మొత్తం 163 దేశాలకు స్థానం లభించింది. డెన్మార్క్, నెదర్లాండ్స్, యూకే, జర్మనీ, ఫిన్‌ల్యాండ్, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ తొలి 10 దేశాల జాబితాలో ఉన్నాయి. లిబియా ఆఖరు స్థానంలో ఉంది. భారత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో 62, సంస్కృతిలో 119, వాతావరణంలో 106, శక్తివంతమైన దేశాల జాబితాలో 100వ స్థానంలో ఉంది. ఈ ద్వైవార్షిక సూచీ రూపక్పన విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వ సలహాదారు సైమన్ అన్‌హోల్ట్ కనుక్కున్నారు.
No comments:
Post a Comment