Saturday, September 17, 2016

అమెరికాలో 2015 నాటికి 4.3 కోట్ల మంది పేదలు


అమెరికాలో 2015 నాటికి 4.3 కోట్ల మందికి పైగా ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నట్లు అమెరికా జనగణన నివేదిక తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో గత 16 సం॥లో పేదరికం రేటు వేగంగా తగ్గిపోతుండటాన్ని ఈ పరిణామం సూచిస్తోంది. 2015లో 13.5 శాతం మంది అమెరికన్లు పేదరికంలో జీవించగా, 2014తో పోలిస్తే 1.2 శాతం తగ్గింది. ఈ స్థాయిలో గతంలో 1998 నుంచి 1999 మధ్య పేదరికం రేట్లు వేగంగా తగ్గాయి. 2015లో 12.2 శాతం మంది పురుషులు, 14.8 శాతం మంది మహిళలు పేదరికంలో జీవిస్తున్నారు.

No comments:

Post a Comment