Monday, September 19, 2016

భారత్‌తో సైనిక సహకారానికి అమెరికా సెనెట్‌ ఆమోదం

భారత్‌తో సైనికపరమైన సహకారాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని అమెరికా సెనెట్‌ ఆమోదించింది. పొంచిఉన్న ముప్పును విశ్లేషించడం, బలగాల ప్రణాళిక, సైన్య సిద్ధాంతం, మౌలిక సదుపాయాలపరమైన మద్దతు, నిఘా సమాచార సేకరణ - విశ్లేషణ ఈ అంశాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోనున్నాయి. ‘జాతీయ రక్షణ అధీకృత చట్టం (ఎన్‌డీఏఏ)- 2017’ను 85-13 ఓట్ల తేడాతో సెనెట్‌ ఆమోదించింది. సంయుక్త సైనిక కార్యకలాపాలు చేపట్టడంపై తగిన చర్యలు తీసుకునే అధికారం ఈ చట్టం ప్రకారం రక్షణ మంత్రికి ఉంటుంది. అధికారుల పరస్పర పర్యటనలపైనా మంత్రి నిర్ణయం తీసుకుంటారు. నౌకాయాన భద్రత, పైరసీ నిరోధం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లోనూ రెండు దేశాలూ సహకరించుకుంటాయి.

No comments:

Post a Comment