Monday, September 19, 2016

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మహిళల జాబితా`2016లో నలుగురు భారతీయులు

ఫోర్బ్స్‌ 2016 సం॥కు గాను రూపొందించిన ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మహిళల జాబితా’లో నలుగురు భారతీయులు చోటు పొందారు. ఎస్‌బీఐను సాంకేతికత దిశగా నడిపించడమే కాకుండా మొండి బకాయిల సమస్యతో పోరాడుతూ వాటిని గణనీయంగా తగ్గించేందుకు కృషి చేస్తున్న ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలిచారు. వ్యక్తిగత కారణాలతో మహిళా ఉద్యోగులు ఉద్యోగం మానివేయకుండా ప్రత్యేక సదుపాయాలను ప్రవేశపెట్టిన ఐసిఐసిఐ ఎండీ అండ్‌ సీఈఓ చందా కొచ్చర్‌ 40వ స్థానంలో నిలిచారు. ఏడాదిపాటు ఇంటి నుంచే విధులు నిర్వహించేలా ‘ఐ వర్క్‌ ఎట్‌ హోమ్‌’ విధానాన్ని తీసుకొచ్చారు. స్వయంకృషితో వ్యాపారాధినేతగా ఎదిగిన మజుందార్‌ షా ఇన్సులిన్‌ను రూపొందించే విషయంలో బయోకాన్‌ సంస్థను ఉన్నతస్థితికి తీసుకెళ్లారు. భారత్‌లో అతిపెద్ద నమోదిత మీడియా కంపెనీ హెచ్‌టీ మీడియాకు ఛైర్‌పర్సన్‌, ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శోభనా భర్తియా 93వ స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన ఇంద్రనూయి జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక, దాతృత్వం తదితర విభాగాల్లో తమద్కెన ముద్రవేస్తూ దూసుకెళ్తున్న మహిళలతో ఫోర్బ్స్‌ రూపొందించిన ఈ జాబితాలో ఏంజెలా మెర్కిల్‌ (జర్మనీ ఛాన్సెలర్‌) మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపెడుతున్న హిల్లరీ క్లింటన్‌ రెండో స్థానంలో నిలిచారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్‌పర్సన్‌ జానెట్‌ యెలెన్‌ జాబితాలో మూడోస్థానంలో నిలిచారు.

No comments:

Post a Comment