ఎల్‌నినో కారణంగా వెనెజులాను తీవ్ర కరవు వెంటాడుతున్న నేపథ్యంలో ఈ విషమ పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడేందుకు అధ్యక్షుడు నికోస్ 2016 ఏప్రిల్ 17న 3 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెనెజులా కాలమానాన్ని అరగంట ముందుకు జరుపుతున్నట్లు ప్రకటించారు. దీని వల్ల ప్రజల దైనందిన జీవితాల్లో మార్పు వస్తుందని, విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు. వెనెజులా కాలమానాన్ని 2007లో గత అధ్యక్షుడు దివంగత హ్యుగో చావెజ్ అరగంట వెనక్కి జరిపారు. తాజా మార్పుల వల్ల వెనెజులా కాలమానం గ్రీన్‌విచ్ మిన్‌టైమ్‌లో మైనస్ 4 గంటలుగా ఉండనుంది.
No comments:
Post a Comment