కరెన్సీ నోట్లపై ప్రముఖుల చిత్రాల ముద్రణకు సంబంధించి అమెరికా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బానిసత్వంపై పోరాడిన ప్రముఖ ఉద్యమకారిణి హారిమెట్ టబ్‌మ్యాన్ చిత్రాన్ని 20 డాలర్ల నోటుపై ముద్రించాలని నిర్ణయించింది. గత శతాబ్దానికి పైగా కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే అమెరికా బ్యాంకు నోట్లపై కనిపించనున్న తొలి మహిళ ఆమే కానుండటం విశేషం. అమెరికా కరెన్సీపై కనిపించనున్న తొలి ఆఫ్రికన్ - అమెరికన్ కూడా ఆమే. 1820ల్లో బానిసగా టబ్‌మ్యాన్ జన్మించారు. రాజీలేని పోరాటంతో వందలాది మందికి బానిసత్వం నుంచి ఆమె విముక్తి కల్పించారు. ప్రస్తుతం 20 డాలర్ల నోటు ముందు భాగంలో ఉన్న తమ దేశ ఏడో అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ చిత్రాన్ని అదే నోటుపై వెనుక భాగంలో ముద్రించాలని అమెరికా నిర్ణయించింది. ముందు భాగంలో టబ్ మ్యాన్ చిత్రం ఉంటుంది. 10 డాలర్లు, 5 డాలర్ల నోట్ల పైన కూడా మహిళలు, పౌర హక్కుల నేతల చిత్రాలను ముద్రించాలని అమెరికా నిర్ణయించింది.
No comments:
Post a Comment